SpiceJet: స్పైస్‌జెట్‌ బంపర్‌ ఆఫర్‌.. EMIతో విమాన టిక్కెట్లు!

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. విమాన టిక్కెట్ల ధరలను సులభ వాయిదాల పద్ధతి(ఈఎంఐ)లో చెల్లించేందుకు అనుమతించనుంది....

Updated : 08 Nov 2021 16:06 IST

దిల్లీ: భారత్‌లో విమాన ప్రయాణం సామాన్యులకు ఇప్పటికీ ఓ కలే. అధిక ఛార్జీలే అందుకు కారణం. అయితే, అలాంటి వారి కలలను నిజం చేయడం కోసం ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. విమాన టిక్కెట్ల ధరలను సులభ వాయిదాల పద్ధతి(ఈఎంఐ)లో చెల్లించేందుకు అనుమతించనుంది. మొత్తం మూడు, ఆరు, 12 నెలల వ్యవధితో ఈఎంఐలు చెల్లించే ఆప్షన్‌ ఇవ్వనుంది.

ఈ ఆఫర్‌ను ఉపయోగించాలనుకునేవారు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ధ్రువీకరణ నిమిత్తం శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌), ఆధార్‌, వీఐడీ వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికులు యూపీఐ ద్వారా తొలి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తర్వాతి ఈఎంఐలు అదే యూపీఐ నుంచి డిడక్ట్‌ అవుతాయి. క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని