Starlink: గ్రామీణ నియోజకవర్గాల్లో స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

భారత్‌లో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌కు చెందిన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విభాగం స్టార్‌లింక్‌ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తొలుత ఈ సేవలు ప్రారంభించేందుకు గ్రామీణ ప్రాంత లోక్‌సభ నియోజకవర్గాలను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు స్టార్‌లింక్ భారత విభాగం డైరెక్టర్‌ సంజయ్‌ భార్గవ తెలిపారు.

Published : 03 Oct 2021 22:16 IST

దిల్లీ: భారత్‌లో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌కు చెందిన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విభాగం స్టార్‌లింక్‌ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తొలుత ఈ సేవలు ప్రారంభించేందుకు గ్రామీణ ప్రాంత లోక్‌సభ నియోజకవర్గాలను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు స్టార్‌లింక్ భారత విభాగం డైరెక్టర్‌ సంజయ్‌ భార్గవ తెలిపారు. ఈ మేరకు అక్టోబరులో ఆయన స్వయంగా ఎంపీలు, మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులతో వర్చువల్‌గా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. భారత్‌కు వచ్చే టెర్మినళ్లలో 80 శాతం గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలకే కేటాయించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. అయితే అందుకు ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది డిసెంబరు నుంచి 2 లక్షల యాక్టివ్‌ టెర్మినళ్లతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రారంభించాలని స్టార్‌లింక్‌ భావిస్తోంది. ఇందుకు ప్రభుత్వ అనుమతులు లభించాల్సి ఉంది. భారత్‌ నుంచి ముందస్తు ఆర్డర్లు 5000 దాటాయని, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు కంపెనీ చూస్తున్నట్లు సంజయ్‌ భార్గవ తెలిపారు. వినియోగదారుల నుంచి కంపెనీ డిపాజిట్‌గా 99 డాలర్లు(దాదాపు రూ.7,350) వసూలు చేస్తోంది. బీటా దశలో 50 నుంచి 150 ఎంబీపీఎస్‌ వేగాన్ని అందిస్తామని కంపెనీ చెబుతోంది. బ్రాడ్‌బ్యాండ్‌ విభాగంలో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాలతో స్టార్‌లింక్‌ పోటీపడనుంది. భారతీ గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో ప్రత్యక్ష పోటీ నెలకొనే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని