ఎస్‌బీఐ కొత్త గృహ రుణ వ‌డ్డీ రేట్లు ఎంతో తెలుసా ?

ఎస్బీఐ ఆమోదించిన ప్రాజెక్టుల‌లో గృహ రుణాలు పొందే వినియోగ‌దారుల కోసం 2021 మార్చి వ‌ర‌కు ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది.

Updated : 12 Feb 2021 14:08 IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మార్చి వ‌ర‌కూ ప్రాసెసింగ్ ఫీజు లేకుండా 6.8% వ‌డ్డీ రేటుకు గృహ రుణాలు అందిస్తోంది. గృహ రుణ విభాగంలో ఎస్‌బీఐ దేశం మొత్తం మీద 34% మార్కెట్ వాటాను సాధించాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఎస్‌బీఐ ఆమోదించిన ప్రాజెక్టుల‌లో గృహ రుణాలు పొందే వినియోగ‌దారుల కోసం 2021 మార్చి వ‌ర‌కూ ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది. గృహ రుణ వ్యాపారం యొక్క అభివృద్ధికి, వినియోగ‌దారుల వృద్ధిని పెంచ‌డానికి బ్యాంక్ సిబ్బంది మ‌రియు వినియోగ‌దారుల అన్నీ విశ్లేష‌ణ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి బ్యాంక్ తీసుకుంటుంది. వినియోగ‌దారుల కోసం గృహ రుణ ప్రయాణాన్ని సుల‌భ‌త‌రం చేయ‌డం కోసం బ్యాంక్ అంతిమ మార్గంగా ప‌నిచేస్తుంద‌ని తెలిపింది.

ఎస్‌బీఐ 2020 డిసెంబ‌ర్ వ‌ర‌కు `పీఎమ్ఎవై` (ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న) స‌బ్సిడీని దాదాపు 2 ల‌క్ష‌ల గృహ రుణ‌దారుల‌కు అంద‌చేసింది. ఈ స‌బ్సిడీని ప్రాసెస్ చేయ‌డానికి సెంట్ర‌ల్ నోడ‌ల్ ఏజెన్సీగా గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ నియ‌మించిన ఏకైక బ్యాంకు ఎస్‌బీఐ.

2022 నాటికి అంద‌రికి ఇళ్లు అనే ప్ర‌భుత్వ నినాదానికి మ‌ద్ద‌తుగా, ఎస్‌బీఐ `పీఎంఎవై` కింద 1,94,582 గృహ రుణాల‌ను మంజూరు చేసింది.

బ్యాంకు యొక్క గృహ రుణ వ్యాపారాన్ని మాత్ర‌మే కాకుండా ఇత‌ర వ్యాపారాల‌ను కూడా ముందుకు న‌డిపించ‌డంలో కీల‌క పాత్ర పోషించ‌గ‌ల ఏ1, క్లౌడ్‌, బ్లాక్ చెయిన్‌, మెషిన్ లెర్నింగ్‌ను అమ‌లు చేయ‌డంపై కూడా ఎస్‌బీఐ చూస్తోంది.

గృహ రుణాల కోసం స‌హ‌-రుణ న‌మూనాను ప్రారంభించ‌డానికి ఎస్‌బీఐ స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇది అసంఘ‌టిత రంగంలో ఎస్‌బీఐ యొక్క ప్ర‌వేశాన్ని పెంచ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. 215 కేంద్రాల‌లో సెంట్ర‌ల్ ప్రాసెసింగ్ సెంట్ర‌ల్ ప్రాసెసింగ్ సెంట‌ర్స్‌, బ్యాంక్ డిజిట‌ల్ మ‌రియు లైఫ్ స్టైల్ ప్లాట్‌ఫాం, యోనో ద్వారా విస్త‌రించ‌బ‌డిన విస్తార‌మైన శాఖ‌ల అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించ‌డంతో, ఎస్‌బీఐ గృహ రుణ వ్యాపారంలో రూ. 5 ల‌క్ష‌ల కోట్ల మార్కుని తాకింది.

గృహ రుణాల‌ను అందించ‌డానికి సామ‌ర్థ్యాన్ని మెరుగుప‌రిచేందుకు బ్యాంక్ వివిధ డిజిట‌ల్ కార్య‌క్ర‌మాల‌పై కృషి చేస్తోంది. ఇందులో ప్ర‌త్యేక‌మైన ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫాం రిటైల్‌లోన్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ ఉంది. ఇది అన్ని సేవ‌ల‌ను ఆఖ‌రివ‌ర‌కు డిజిట‌ల్‌గా అందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు