Updated : 18 Jan 2022 10:32 IST

Stock Market: నష్టాల్లోకి జారుకున్న మార్కెట్‌ సూచీలు.. గరిష్ఠాల వద్ద విక్రయాల ఒత్తిడి

ముంబయి: నేడు ఉదయం సానుకూలంగా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కాసేపట్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ నెలలో సూచీలు ఇప్పటికే 5 శాతానికి పైగా పెరగడంతో గరిష్ఠాల వద్ద సూచీలకు అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఆటో, టెలికాం, బేసిక్‌ మెటీరియల్స్‌, హెల్త్‌కేర్‌ రంగాల్లో  అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎగబాకడంతో మదుపర్లు కొంతమేర అప్రమత్తమయ్యారు. రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజాలు నష్టాల్లోకి జారుకోవడంతో సూచీలు డీలా పడ్డాయి.

ఉదయం 10:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 299 పాయింట్ల నష్టంతో 61,009 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 18,203 వద్ద చలిస్తోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. 

* నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో కేవలం 12 మాత్రమే లాభాల్లో ఉండగా.. మిగిలిన 38 నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి హెవీవెయిట్‌ షేర్లు కూడా భారీ నష్టాలను చవిచూడటం సూచీలను కుంగదీసింది. 

* నేడు నిఫ్టీలో ఐటీ సూచీ 0.55 పతనమైంది. ఒక్క టీసీఎస్‌ షేర్‌ మాత్రమే 0.08శాతం లాభంతో ఉండగా.. టెక్‌ మహీంద్రా 1.18శాతం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 1.16శాతం, మైండ్‌ ట్రీ 1.09శాతం, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌ 0.63శాతం, ఇన్ఫోసిస్‌ 0.61శాతం పతనమయ్యాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని