Stock Market: జీవనకాల గరిష్ఠానికి నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీల్లో శుక్రవారం లాభాల జోరు కనిపించింది. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ మొదలు పెట్టిన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ఓ దశలో.....

Published : 28 May 2021 15:43 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీల్లో శుక్రవారం లాభాల జోరు కనిపించింది. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ మొదలు పెట్టిన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ఓ దశలో 128 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ 15,469 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 97 పాయింట్ల లాభంతో 15,435 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్‌ 307 పాయింట్లు లాభపడి 51,422 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.47 వద్ద నిలిచింది.

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా కరోనా కేసుల తగ్గుముఖం పట్టడం మదుపర్లలో విశ్వాసం నింపింది. కరోనా రోజువారీ కేసులు నేడు 44 రోజుల కనిష్ఠానికి చేరడం సూచీలకు దన్నుగా నిలిచింది. వీటికి తోడు అమెరికాలో మహమ్మారి సంక్షోభం నుంచి బయటపడేందుకు అక్కడి ప్రభుత్వం భారీ ఉద్దీపన పథకాల్ని ప్రవేశపెడుతుండడం అక్కడి సూచీలతో పాటు ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. దీంతో నేడు ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. ఇక దేశీయంగా రిలయన్స్‌ వంటి కొన్ని కీలక కంపెనీలు షేర్లు రాణించాయి. ఈ నేపథ్యంలోనే నేడు సూచీలు లాభాల బాటలో పయనించాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, డాక్టర్ రెడ్డీస్‌, పవర్‌ గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌ షేర్లు నష్టాలు చవిచూడగా.. రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో పయనించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని