కోటి రూపాయల టర్మ్ బీమా సరిపోతుందా?
బీమా హామీ మొత్తం ప్రస్తుత వ్యయాలతో పాటు, భవిష్యత్తు అవసరాలకు సరిపోయే విధంగా ఉండాలి.
కోటి రూపాయల టర్మ్ బీమా పాలసీ తీసుకుంటున్నారా? కానీ అంతే ఎందుకు? అదే మీ కుటుంబానికి మొత్తం హామీ ఇస్తుందని భావిస్తున్నారా? టర్మ్ బీమా పాలసీ తీసుకునేముందు హామీ మొత్తాన్ని లెక్కించాలి. ఇంట్లో అందరు ఒకరి సంపాదనపై ఆధారపడితే హామీ మొత్తం కుటుంబానికి వారికి సరిపోయే విధంగా ఉండాలి. మీతో పాటు కుటుంబంలో ఇతరులు ఆదాయం పొందుతుంటే వారు కూడా బాధ్యత పంచుకునే అవకాశం ఉంటుంది.
పాలసీ తీసుకునేటప్పుడు ఒక వ్యక్తికి ఎంత వరకు పరిమితి ఉందో తెలుసుకోవాలి. చాలా వరకు బీమా సంస్థలు జీవిత బీమా కవరేజ్‌ను ఆదాయానికి 15 లేదా 20 రెట్ల అధికంగా ఇస్తున్నాయి. బీమా పాలసీ తీసుకునే ముందు కొన్ని సంస్థల జాబితాను తయారు చేసుకోవాలి. లైఫ్ కవర్‌కి ఆయా సంస్థలు ఎంత మొత్తం హామిని ఉస్తున్నాయో పోల్చి చూడాలి. కుటుంబ అవసరాలకు దేనికి ఎంత ఖర్చవుతుందో ఒక అంచనాకు రావాలి. మీరు లేనప్పుడు కూడా ఆర్థిక భరోసా కల్పించే విధంగా హామీ మొత్తం ఉండాలి. ద్రవ్యోల్బణ అంచనాతో సరిపడే ఆదాయం పొందేలా ఖర్చులను లెక్కించాలి. వచ్చే 10,15 లేదా 25 ఏళ్లలో ద్రవ్యోల్బణం ఎంతకు పెరుగుతుందో, అప్పటికి పిల్లల వయసు ఎంత ఉంటుంది, వారి అవసరాలు ఏముంటాయన్న విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లల స్కూల్ ఫీజు, కాలేజీ ఫీజు, పెళ్లి ఖర్చులు, ఏవైనా రుణాలు ఉంటే అవి చెల్లించేందుకు సరిపడేలా ఉండాలి. మీ కుటుంబ నెలవారి ఖర్చులు నెలకు రూ.35 వేలు అనుకుంటే, ద్రవ్యోల్బణాన్ని అదిగమించి ఆదాయాన్ని పొందాలంటే, హామీ మొత్తం పెట్టుబడులు చేస్తే వచ్చిన రాబడి 8 శాతం, ద్రవ్యోల్బణం కూడా 8 శాతం అనుకుంటే, వచ్చే 20 ఏళ్లకు అంటే పిల్లలు వారు సొంతంగా సంపాదించుకునే వయసు వచ్చేంత వరకు హామీ ఉండాలి. హామీ మొత్తం = వార్షిక ఖర్చులు* కాలపరిమితి. హామీ మొత్తం = (35,000*12)*20 = రూ.84 లక్షలు. అయితే కోటి రూపాయల టర్మ్ బీమా పాలసీ తీసుకుంటే రూ.84 లక్షలు కేవలం ఖర్చులకే సరిపోతాయి. మరి పిల్లల స్కూల్ ఫీజు కాలేజీ ఫీజు సంగతేంటి? మిగిలిన రూ.16 లక్షలు వీటికి అన్నింటికి సరిపోతాయని మీరు అనుకుంటున్నారా ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే లేదా ఇతర రుణాలు, ఇతర ఖర్చులు ఉంటే? పాలసీ తీసుకునేటప్పుడు కేవలం భవిష్యత్తు అవసరాలను మాత్రమే లెక్కించకుండా, డబ్బు దేనికి ఎంత అవసరమవుతుందో యాక్షన్‌ప్లాన్ తయారు చేయాలి. సెబీ నమోదిత ఆర్థిక సలహాదారులను సంప్రదిస్తే హామీ మొత్తం ఎలా ఉపయోగించుకోవాలో సూచిస్తారు. లేకపోతే క్లెయిమ్ మొత్తం సరిగా ఉపయోగించుకోలేకపోవచ్చు.
సిరి లో ఇంకా
మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్