Sun Pharma: మూడు కీలక ఔషధ హక్కులు

దేశీయ ఫార్మాదిగ్గజం శుక్రవారం భారత్‌లో విక్రయించేందుకు మూడు కీలక ఔషధాలపై హక్కులను ఆస్ట్రాజెనికా నుంచి కొనుగోలు చేసింది. డయాబెటిక్‌ చికిత్సలో వినియోగించే ఆక్స్‌రా,ఆక్స్‌రామెట్‌,ఆక్స్‌రాడ్యూ బ్రాండ్లతో విక్రయించే డపగ్లిఫ్లోజిన్‌

Updated : 18 Aug 2022 11:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ ఫార్మాదిగ్గజం శుక్రవారం భారత్‌లో విక్రయించేందుకు మూడు కీలక ఔషధాలపై హక్కులను ఆస్ట్రాజెనికా నుంచి కొనుగోలు చేసింది. డయాబెటిక్‌ చికిత్సలో వినియోగించే ఆక్స్‌రా, ఆక్స్‌రామెట్‌, ఆక్స్‌రాడ్యూ బ్రాండ్లతో విక్రయించే డపగ్లిఫ్లోజిన్‌ ఔషధంపై హక్కులు సన్‌ఫార్మాకు లభించాయి.  దీంతో 2016లో సన్‌ఫార్మా, ఆస్ట్రాజెనికా ఇండియా మధ్య జరిగిన పంపిణీ ఒప్పందం రద్దు కానుంది. ఇక కొత్తగా జరిగిన ట్రాన్సిషన్‌ సప్లయ్‌ ఒప్పందం ప్రకారం ఆస్ట్రాజెనికా ఇండియా నుంచి డపగ్లిఫ్లోజిన్‌, డపగ్లిఫోజిన్‌ కాంబినేషన్‌తో మెటాఫోర్మిన్‌ సరఫరా అవుతాయి. డపగ్లిఫ్లోజిన్‌ అనే ఔషధాన్ని డయాబెటిక్‌ బాధితులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి వినియోగిస్తారు. 

సన్‌ ఫార్మా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్పెషాలిటీ జనరిక్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ.  భారత్‌లో అతిపెద్ద ఫార్మా కంపెనీ కూడా ఇదే. ‘‘సన్‌ ఫార్మా అక్స్‌రా, ఆక్స్‌రామెట్‌, ఆక్స్‌రా డ్యూ ట్రేడ్‌ మార్క్‌ హక్కులను సొంతం చేసుకొంది. వీటిని ఆస్ట్రాజెనికా ఫార్మా ఇండియా పేరెంట్‌ కంపెనీ అయిన ఆస్ట్రాజెనికా ఏబీ నుంచి కొనుగోలు చేశాము. ఈ డీల్‌ 28మే 2021 నుంచి అమల్లోకి వస్తుంది. డపగ్లిఫ్లోజిన్‌, డపగ్లిఫోజిన్‌ కాంబినేషన్‌తో మెటాఫోర్మిన్‌ ఔషధాలను భారత్‌లో తయారు చేయడానికి విక్రయించడానికి ఆస్ట్రాజెనికా నుంచి హక్కులు కొనుగోలు చేశాము’’ అని రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ డీల్‌ అనంతరం ఆస్ట్రాజెనికా ఇండియా స్పందిస్తూ  డపగ్లిఫ్లోజిన్‌, డపగ్లిఫోజిన్‌ కాంబినేషన్‌తో మెటాఫోర్మిన్‌ ఔషధాలను తాము సొంతంగా విక్రయిస్తామని వెల్లడించింది. దీంతోపాటు డపగ్లిఫ్లోజిన్‌ - సాక్సాగ్లిప్టిన్‌లను కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు