అప్పుల భారంగా మారాయ్‌.. ఛార్జీలు పెంచుతాం: మిత్తల్‌

టెలికాం ఛార్జీల విషయంలో భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుల భారంగా మారిన నేపథ్యంలో ఛార్జీలు పెంచేందుకు వెనుకాడబోమని చెప్పారు.

Updated : 24 Nov 2022 12:48 IST

దిల్లీ: టెలికాం ఛార్జీల విషయంలో భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుల భారంగా మారిన నేపథ్యంలో ఛార్జీలు పెంచేందుకు వెనుకాడబోమని చెప్పారు. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్ల నిధులను సమీకరించే ప్రతిపాదనకు భారతీ ఎయిర్‌టెల్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిన మరుసటి రోజైన సోమవారం జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. 

టెలికాం రంగంలో పన్నులు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయని మిత్తల్‌ అన్నారు. ప్రభుత్వం చొరవ చూపి టెలికాం రంగంపై ఉన్న ఒత్తిడిని తగ్గించాలని కోరారు. ప్రతి రూ.100 ఆదాయానికి రూ.35 పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం Average revenue per user (ARPU) (ఆర్పు) రూ.200కు చేరుతుందని అంచనా వేశారు. ఇది క్రమంగా రూ.300కు చేరుతుందని చెప్పారు. రూ.21వేల కోట్ల నిధుల సమీకరణ ద్వారా వచ్చే మొత్తంతో 5జీ, ఫైబర్‌, డేటా సెంటర్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టనున్నామని, ఇది కంపెనీ మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు వీలు కల్పిస్తుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు