T20 World Cup: ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌ల్లో టీ-20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు

ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్‌ ప్రపంచ కప్‌లో భారత్‌ ఆడే మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని తమ థియేటర్లలో ప్రదర్శిస్తామని మల్టీప్లెక్స్‌ల నిర్వహణ సంస్థ ఐనాక్స్‌ లీజర్‌ తెలిపింది. టీ20 ప్రపంచకప్‌ పోటీలను యూఏఈ, ఒమన్‌లలో ...

Updated : 15 Oct 2021 07:06 IST

టికెట్టు ధర రూ.200- 500

దిల్లీ: ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్‌ ప్రపంచ కప్‌లో భారత్‌ ఆడే మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని తమ థియేటర్లలో ప్రదర్శిస్తామని మల్టీప్లెక్స్‌ల నిర్వహణ సంస్థ ఐనాక్స్‌ లీజర్‌ తెలిపింది. టీ20 ప్రపంచకప్‌ పోటీలను యూఏఈ, ఒమన్‌లలో నిర్వహించనున్నారు. మ్యాచ్‌లు ఈనెల 17న ప్రారంభమవుతాయి,  నవంబరు 14న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. అన్ని ప్రధాన నగరాల్లోని తమ మల్టీప్లెక్స్‌ల్లో లీగ్‌ దశ నుంచే భారత మ్యాచ్‌లను ప్రదర్శిస్తామని ఐనాక్స్‌ తెలిపింది. పెద్ద తెరలపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా, క్రికెట్‌ మైదానంలోనే మ్యాచ్‌ను వీక్షిస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు కలగజేయాలన్నదే దీని వెనక ఉద్దేశమని కంపెనీ పేర్కొంది. మ్యాచ్‌లను వీక్షిస్తూ ఆహార పదార్థాల కోసమూ క్రికెట్‌ అభిమానులు ఆర్డరు ఇస్తారు కనుక.. అది కూడా వ్యాపారపరంగా సంస్థకు ప్రయోజనమే. క్రికెట్‌ మ్యాచ్‌ల వీక్షణకు టికెట్టు ధర నగరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని తెలిపింది. ఐనాక్స్‌కు 70 నగరాల్లో 56 మల్టీప్లెక్స్‌లు, 658 తెరలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు