క్యూ3లో టీసీఎస్ లాభం 7.2% జంప్
దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవలు అందించే సంస్థ టీసీఎస్ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. అంచనాలు మించి లాభాలను సొంతం చేసుకుంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన స్థూల లాభం....
ముంబయి: దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవలు అందించే సంస్థ టీసీఎస్ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. అంచనాలు మించి లాభాలను సొంతం చేసుకుంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ.8,701 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.8,118 కోట్లతో పోలిస్తే ఇది 7.2 శాతం అధికం కావడం గమనార్హం.
ఇక కంపెనీ ఆదాయం సైతం 5.4 శాతం వృద్ధి చెందింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో గతేడాది రూ.39,854 కోట్లు ఆదాయం సముపార్జించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.42,015 కోట్లు ఆదాయం వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టీసీఎస్ పేర్కొంది. మూడో త్రైమాసికంలో ఈ స్థాయిలో వృద్ధి కనబర్చడం తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే షేరుకు రూ.6 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను టీసీఎస్ ప్రకటించింది.
ఇవీ చదవండి..
గృహ రుణాలపై SBI గుడ్‌న్యూస్
ధరలు పెంచిన మహీంద్రా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!