TCS jobs: ఫ్రెషర్స్‌కు 40 వేల ఉద్యోగాలు
ముఖ సాఫ్ట్వేర్ ఎగుమతుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) వివిధ క్యాంపస్‌ల నుంచి 40 వేల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ.....
ముంబయి: ప్రముఖ సాఫ్ట్వేర్ ఎగుమతుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) వివిధ క్యాంపస్‌ల నుంచి 40 వేల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఆశాజనక ఫలితాలను ప్రకటించిన మరుసటి రోజే టీసీఎస్ ఈ శుభవార్త చెప్పింది.
ప్రస్తుతం టీసీఎస్‌లో 5 లక్షల మంది పనిచేస్తున్నారు. గతేడాది వివిధ క్యాంపస్‌ల నుంచి 40 వేలమందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మొత్తం 3.60 లక్షల మంది ఫ్రెషర్స్ వర్చువల్‌గా ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరయ్యారని టీసీఎస్ గ్లోబల్ హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగులను చేర్చుకునే క్రమంలో కొవిడ్ నిబంధనలు అడ్డంకిగా మారలేదని తెలిపారు. ఈ ఏడాది కూడా 40వేల మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు లక్కడ్ చెప్పారు. వ్యాపార ఒప్పందాలు పుంజుకోగానే నియామకాలు ప్రక్రియ ప్రారంభిస్తామని వివరించారు. దేశంలో ప్రతిభకు కొదవ లేదని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణియమ్ తెలిపారు. ఖర్చుపై ఆందోళన లేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!