మ్యూచువ‌ల్ ఫండ్ల‌ డివిడెండుపైనే 10 శాతం టీడీఎస్‌

బడ్జెట్‌లో ప్రతిపాదించిన 10 శాతం మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) ప్రతిపాదన… మ్యూచువల్‌ ఫండ్లు చెల్లించే డివిడెండు చెల్లింపుపై మాత్రమే వర్తిస్తుందని, యూనిట్ల విక్రయంతో వచ్చే లాభాలపై కాదని ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది...

Updated : 01 Jan 2021 17:58 IST

బడ్జెట్‌లో ప్రతిపాదించిన 10 శాతం మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) ప్రతిపాదన… మ్యూచువల్‌ ఫండ్లు చెల్లించే డివిడెండు చెల్లింపుపై మాత్రమే వర్తిస్తుందని, యూనిట్ల విక్రయంతో వచ్చే లాభాలపై కాదని ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది. 2020-21 బడ్జెట్‌లో కంపెనీలు, మ్యూచువల్‌ ఫండ్ల డివిడెండుపై చెల్లించే డివిడెండు పంపిణీ పన్ను (డీడీటీ)ను రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని స్థానంలో కంపెనీలు లేదా మ్యూచువల్‌ ఫండ్లు చెల్లించే డివిడెండుపై 10 శాతం టీడీఎస్‌ను వసూలు చేయాలని ప్రతిపాదించారు. ఏడాదికి డివిడెండు లేదా ఆదాయం రూ.5000 మించితే ఈ మొత్తాన్ని వసూలు చేస్తారు. దీనిపై పలు సందేహాలు రావడంతో, తాజాగా సీబీడీటీ స్పష్టత ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని