TVS Apache RR 310: మార్కెట్లోకి కొత్త అపాచీ.. మీరే డిజైన్‌ చేసుకోండి!

దేశీయ ద్విచక్ర వాహన కంపెనీ తయారీదారు టీవీఎస్‌.. మరో బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తన విజయవంతమైన మోడల్‌ అపాచీ సిరీస్‌లో కొత్త అపాచీ ఆర్‌ఆర్‌ 310 2021ను తీసుకొచ్చింది.

Updated : 30 Aug 2021 21:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ ద్విచక్ర వాహన కంపెనీ తయారీదారు టీవీఎస్‌.. మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తన విజయవంతమైన మోడల్‌ అపాచీ సిరీస్‌లో కొత్త అపాచీ ఆర్‌ఆర్‌ 310 2021ను తీసుకొచ్చింది. వాస్తవానికి ఏప్రిల్‌ నెలలోనే ఈ బైక్‌ విడుదల అవ్వాల్సి ఉండగా.. కొవిడ్‌ కారణంగా ఆలస్యమైంది. గతేడాది విడుదల చేసిన వెర్షన్‌తో పోలిస్తే కొన్ని కీలక మార్పులతో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఈ బైక్‌ ధరను కంపెనీ రూ.2.59 లక్షలుగా (ఎక్స్‌ షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది.

టీవీఎస్‌ తొలిసారి బిల్డ్‌-టు- ఆర్డర్‌ (బీటీవో) విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. మీకు నచ్చినట్లుగా మీ బైక్‌ను డిజైన్‌ చేసుకోవచ్చు. టీవీఎస్‌ అరైవ్‌ యాప్‌/ వెబ్‌సైట్‌ ద్వారా మీకు నచ్చిన సదుపాయాలతో బైక్‌ను ఆర్డర్‌ చేయొచ్చు. కొద్దిరోజుల తర్వాత బైక్‌ను సమీప డీలర్‌ వద్ద పొందొచ్చు. ప్రతి నెలా 100 యూనిట్లను ఈ తరహాలో కంపెనీ ఉత్పత్తి చేయనుంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ బైక్‌లో 313 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 9,700 ఆర్‌పీఎం వద్ద 34 బీహెచ్‌పీని, 7,700 ఆర్‌పీఎం వద్ద 27.3 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ను అమర్చారు. బ్లూటూత్‌ కనెక్టివిటీతో పాటు అర్బన్‌, ట్రాక్‌, స్పోర్ట్, రెయిన్‌ వంటి రైడింగ్‌ మోడ్స్‌ను అమర్చారు. ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి డిజిటల్‌గా దాచుకునేందుకు డిజి డాక్స్‌ సదుపాయాన్ని ఇస్తున్నారు. కేటీఎం ఆర్‌సీ 390కి ఈ బైక్‌ పోటీగా నిలవనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని