TVS Jupiter: మార్కెట్లోకి టీవీఎస్‌ జూపిటర్‌ 125

దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ సరికొత్త జూపిటర్‌ 125సీసీని మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Published : 07 Oct 2021 21:36 IST

దిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సరికొత్త జూపిటర్‌ 125సీసీని ఆవిష్కరించింది. ఇప్పటి వరకు 110సీసీకే పరిమితమైన ఈ మోడల్‌ను 125 సీసీకి విస్తరించింది. దీని ద్వారా ఈ సెగ్మెంట్‌లో ప్రత్యర్థి కంపెనీలకు టీవీఎస్‌ గట్టి పోటీ ఇవ్వనుంది. రెండు హెల్మెట్లు భద్రపరిచేంత సీట్‌ స్పేస్‌తో ఈ స్కూటర్‌ వస్తుండడం ప్రత్యేకత.

జూపిటర్‌ 125 సీసీ ధరను కంపెనీ రూ.73,400 (ఎక్స్‌షోరూమ్‌, దిల్లీ)గా నిర్ణయించింది. స్మార్ట్‌ అలెర్ట్స్‌తో కూడిన సెమీ డిజిటల్‌ స్పీడోమీటర్‌ను ఇందులో అమర్చారు. దీంట్లో యావరేజ్‌ మైలేజీతో పాటు రియల్‌టైమ్‌ మైలేజీని కూడా చెక్‌ చేసుకోవచ్చు. సీట్‌ కింద 33 లీటర్ల కెపాసిటీ అందిస్తున్నారు. ఇందులో రెండు ఫుల్‌ ఫేస్‌ హెల్మెట్లను పెట్టుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ముందువైపే పెట్రోల్‌ నింపే సదుపాయం ఇస్తున్నారు. ఇంకోవైపు మొబైల్‌ ఛార్జింగ్‌ పెట్టుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. డ్రమ్‌, డ్రమ్‌ అల్లాయ్‌, డిస్క్‌ వేరియంట్స్‌లో మొత్తం నాలుగు రంగుల్లో ఈ స్కూటర్‌ లభ్యం కానుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హోండా యాక్టివా 125సీసీ, సుజుకీ యాక్సెస్‌ 125సీసీకి సరికొత్త జూపిటర్‌ పోటీ కాగలదని కంపెనీ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని