TVS : టీవీఎస్‌-టాటా పవర్‌ మధ్య కీలక ఒప్పందం..!

టీవీఎస్‌ మోటార్స్‌ - టాటా పవర్‌ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఎంవోయూ ప్రకారం దేశ వ్యాప్తంగా విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ వ్యవస్థల వృద్ధి కోసం ఇరు కంపెనీలు కలిసి పనిచేస్తాయి.

Updated : 05 Oct 2021 17:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీవీఎస్‌ మోటార్స్‌ - టాటా పవర్‌ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఎంవోయూ ప్రకారం దేశ వ్యాప్తంగా విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ వ్యవస్థల వృద్ధి కోసం ఇరు కంపెనీలు కలిసి పనిచేస్తాయి. టీవీఎస్‌ మోటార్స్ సంస్థల ప్రాంగాణాల్లో సౌరశక్తితో విద్యుత్తు ఉత్పత్తి ఏర్పాట్లు చేయనున్నారు. భారత్‌లో విద్యుత్తు వాహనాల ఉత్పత్తిని వేగవంతం చేయడం కోసం భారీగా మౌలిక సదుపాయాలు కల్పించడమే ఈ ఒప్పందం ముఖ్య లక్ష్యం. 

టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వినియోగదారులు దేశవ్యాప్తంగా టాటాపవర్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను వినియోగించుకొనేలా ఏర్పాట్లు చేయనున్నారు. దీనికోసం వినియోగదారుడు టీవీఎస్‌ కనెక్ట్‌ యాప్‌ను, టాటాపవర్‌ ఈజడ్‌ యాప్‌ను వినియోగించాల్సి ఉంది. ఈ భాగస్వామ్యంలో సాధారణ ఏసీ ఛార్జింగ్‌ సౌకర్యంతోపాటు, డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.  ‘‘కాలుష్య రహిత వాహనాలను వినియోగదారులకు అందించేందుకు టీవీఎస్‌ ఎప్పుడూ ముందుంటుంది. టాటా పవర్‌తో భాగస్వామ్యానికి టీవీఎస్‌ మోటార్స్‌ ఉత్సాహం ఉంది’’ అని టీవీఎస్‌ మోటార్స్‌ జాయింట్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌ వేణు పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని