‘తాజ్‌’ చాలా స్ట్రాంగ్‌..! 

తమ ‘తాజ్‌’ బ్రాండ్‌ హోటళ్లలోనే అతి శక్తివంతమైందగా గుర్తింపు  పొందిందని ఇండియా హోట్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌) పేర్కొంది. ఇండియా హోటల్స్‌ టాటా గ్రూప్‌లో ఒక భాగం. లండన్‌కు చెందిన బ్రాండ్‌ ఫైనాన్స్‌ అనే కన్సల్టెన్సీ ‘హోటల్స్‌ 50 2021’ అనే నివేదిక జారీ చేసింది.

Published : 25 Jun 2021 22:21 IST

 భారత కంపెనీకి అరుదైన గుర్తింపు

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ ‘తాజ్‌’ బ్రాండ్‌ హోటళ్లలోనే అతి శక్తిమంతమైనదిగా గుర్తింపు  పొందిందని ఇండియా హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌) పేర్కొంది. ఇండియా హోటల్స్‌ టాటా గ్రూప్‌లో ఒక భాగం. లండన్‌కు చెందిన బ్రాండ్‌ ఫైనాన్స్‌ అనే కన్సల్టెన్సీ ‘హోటల్స్‌-50 2021’ అనే నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన, శక్తిమంతమైన బ్రాండ్లను గుర్తించింది.  సర్వేలో తాజ్‌  100కు 89.3 పాయింట్లు సాధించింది. దీంతో ఏఏఏ రేటింగ్‌ కూడా లభించింది. కస్టమర్లకు సేవలు, సుపరిచితం, కార్పొరేట్‌ పేరు ప్రఖ్యాతులు వంటి అంశాలు దీనికి బాగా సహకరించాయి. దీనిపై ఐహెచ్‌సీఎల్‌ ఎండీ, సీఈవో పునీత్‌ ఛాత్వాల్‌ ‘‘తాజ్‌ బ్రాండ్‌ అతి శక్తిమంతమైందిగా గుర్తింపు రావడం మాపై వినియోగదారులు ఉంచిన్న నమ్మకానికి నిదర్శనం. అతిథులకు ప్రపంచ స్థాయి విలాసవంతమైన అనుభవాన్ని, ఆతిథ్యాన్ని అందించేందుకు కృషి చేస్తాం’’ అని పేర్కొన్నారు.

బ్రాండ్‌ ఫైనాన్స్‌ కన్సల్టెన్సీ  సీఈవో డేవిడ్‌ హైజ్‌ మాట్లాడుతూ.. వందేళ్ల నాటి తాజ్‌ బ్రాండ్‌ కొవిడ్‌ మహమ్మారిని కూడా తట్టుకొని బలంగా నిలిచిందన్నారు. ‘‘ప్రపంచ పర్యాటకులు సందర్శించి , బ్రాండ్లను పరీక్షించిన తర్వాత తాజ్‌ అగ్రస్థానానికి చేరింది’’ అని పేర్కొన్నారు. ఇక  హిల్టన్‌ హోటల్స్‌ అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. వాస్తవానికి ఈ హోటల్‌ 30శాతం విలువ కోల్పోయి 7.6 బిలియన్‌ డాలర్లకు చేరినా ఈ ఘనత సాధించడం విశేషం. పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్‌ను ఇస్తారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని