Tata AIA Telemedicine: పాలసీదారులకు టెలిమెడిసిన్‌ సేవలు: టాటా ఏఐఏ

తన పాలసీదారులకు టెలిమెడిసిన్‌ సేవలతోపాటు, ఆన్‌లైన్‌ మెడికల్‌ కన్సల్టేషన్లను అందిస్తున్నట్లు టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది.....

Published : 03 Oct 2021 14:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: తన పాలసీదారులకు టెలిమెడిసిన్‌ సేవలతోపాటు, ఆన్‌లైన్‌ మెడికల్‌ కన్సల్టేషన్లను అందిస్తున్నట్లు టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. ఇందుకోసం వైద్య సేవల సంస్థ ప్రాక్టోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌-19తోపాటు 22 రకాల ప్రత్యేక చికిత్సలకూ ఈ ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. బీమా పాలసీదారులకు ఎప్పుడూ వైద్య సేవలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని టాటా ఏఐఏ లైఫ్‌ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ వెంకీ అయ్యర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు