Automobile Price Hike: వచ్చేవారం పెరగనున్న ‘టాటా’ ధరలు!

వచ్చే వారం నుంచి ప్యాసెంజర్‌ వాహనాల ధరలు పెంచేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సిద్ధమవుతోంది.  ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. స్టీల్‌ సహా పలాడియం, రోడియం వంటి ఇతర లోహాల ధరలు భారీగా పెరిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.....

Published : 28 Jul 2021 16:43 IST

ముంబయి: వచ్చే వారం నుంచి ప్యాసెంజర్‌ వాహనాల ధరలు పెంచేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సిద్ధమవుతోంది.  ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. స్టీల్‌ సహా పలాడియం, రోడియం వంటి ఇతర లోహాల ధరలు భారీగా పెరిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీంతో ఏడాది వ్యవధిలో తమ ఆదాయంపై 8-8.5 శాతం ప్రభావం ఉన్నట్లు సంస్థ అధ్యక్షుడు శైలేష్‌ చంద్ర తెలిపారు. అయినప్పటికీ.. ఆ భారాన్ని వినియోగదారులకు స్వల్ప స్థాయిలోనే బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయే మోడల్‌పై ఎంత మేర ధరలు పెంచాలన్న దానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందన్నారు.

ఇటీవలి నెలల్లోనే రెండు సార్లు ధరలు పెంచిన వాహన తయారీ కంపెనీలు, మరోసారి ధరల పెంపు దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగడం ఇందుకు నేపథ్యం. గత 9 నెలల్లోనే ఉక్కు ధరలు 50 శాతం మేర పెరిగాయి. దీంతో స్కూటర్ల నుంచి భారీ ట్రక్కుల వరకు తయారు చేసే కంపెనీలు ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా రెండు సార్లు ధరలను పెంచాయి. జూన్‌ త్రైమాసికంలో ముడి పదార్థాల ధరలు తగ్గుతాయన్న అంచనాలు తల్లకిందులవ్వడంతో, ధరలను మళ్లీ పెంచక తప్పదని పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని