
Published : 18 Jan 2022 14:22 IST
Tata Motors Price Hike: పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఎప్పుడంటే?
దిల్లీ: తమ వాహన ధరలను సగటున 0.9 శాతం మేర పెంచనున్నట్లు ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రకటించింది. కొత్త ధరలు ఈనెల 19 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ముడిపదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. జనవరి 18, 2022కి ముందు బుక్ చేసుకున్న కార్లకు ధరల పెంపు వర్తించదని స్పష్టం చేసింది. మరోవైపు వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కొన్ని నిర్దిష్ట వేరియంట్ల ధరలను రూ.10,000 వరకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
మారుతీ సుజుకీ సైతం తమ వాహన ధరలను 0.1-4.3 శాతం మేర పెంచినట్లు ఇటీవలే ప్రకటించింది. కొత్త ధరలు ఈనెల 15 నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది.
ఇవీ చదవండి
Tags :