టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వాహనాలు ఇక ప్రియం

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వాహన ధరలను పెంచేందుకు సిద్ధమైంది. జనవరి 1 నుంచి 2.5 శాతం చొప్పున ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది.

Published : 06 Dec 2021 21:30 IST

దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వాహన ధరలను పెంచేందుకు సిద్ధమైంది. జనవరి 1 నుంచి 2.5 శాతం చొప్పున ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరకు ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. మీడియం, హెవీ, ఇంటర్మీడియట్‌, లైట్‌, స్మాల్‌ కమర్షియల్‌ వెహిల్స్‌తో పాటు బస్సుల ధరలను కూడా పెంచబోతున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టాటా మోటార్స్‌ పేర్కొంది. స్టీల్‌, అల్యూమినియం, ఇతర లోహాల ధరలు పెరగడంతో కమర్షియల్‌ వాహనాల ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే కార్ల తయారీ కంపెనీలైన మారుతీ సుజుకీ ఇండియా, మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి కంపెనీలు వచ్చే నెల నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని