​​​​​​ధరల పెంపు బాటలో మరిన్ని వాహన కంపెనీలు

వాహన తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, రెనో, హోండా కార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఫోర్డ్‌ ఇండియా వంటి కార్ల తయారీ కంపెనీలతో పాటు ద్విచక్ర వాహన......

Published : 30 Dec 2020 15:50 IST

ముంబయి: వాహన తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, రెనో, హోండా కార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఫోర్డ్‌ ఇండియా వంటి కార్ల తయారీ కంపెనీలతో పాటు ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్‌ సైతం ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయి. తాజాగా టాటా మోటార్స్‌, ఇసుజు, బీఎండబ్ల్యూ సైతం ధరలు పెంచుతున్నట్లు వెల్లడించాయి.

వచ్చే నెల 1వ తేదీ నుంచి తన కమర్షియల్‌ వాహనాల ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. ముడి పదార్థాల ధరలు, ఇతర కారణాల వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడానికి తోడు బీఎస్‌-6 ప్రమాణాలకు మారాల్సి రావడంతో ఈ పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో పేర్కొంది. బీఎండబ్ల్యూ సైతం అన్ని రకాల వాహనాలపై జనవరి 4 నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. బీఎండబ్ల్యూ, మినీ వాహనాలపై 2 శాతం మేర ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఇసుజు సైతం తన పికప్‌ వాహనాలపై జనవరి 1 నుంచి దాదాపు రూ.10 వేల మేర పెంచనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇవీ చదవండి..
పెరిగిన బంగారం ధర
‘కొత్త’ భయం.. మార్కెట్లకు బ్లాక్‌ మండే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు