Tata Punch: మార్కెట్లోకి టాటా పంచ్‌.. ధర ఎంతో తెలుసా..

దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటామోటార్స్‌ సరికొత్త మైక్రో ఎస్‌యూవీ పంచ్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభధర రూ.5.49లక్షలుగా నిర్ణయించారు.  ఇక అత్యున్నత శ్రేణి కియేటీవ్‌ ఏఎంటీ ట్రిమ్‌ ధర

Updated : 18 Oct 2021 15:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటామోటార్స్‌ సరికొత్త మైక్రో ఎస్‌యూవీ ‘పంచ్‌’ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ.5.49లక్షలుగా నిర్ణయించారు.  ఇక అత్యున్నత శ్రేణి క్రియేటివ్‌ ఏఎంటీ ట్రిమ్‌ ధర రూ.9.09లక్షలుగా ఉంది. సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన సందర్భంగా ఇచ్చిన ఈ ఆఫర్‌ ధరలు కేవలం డిసెంబర్‌ 31వరకు అమల్లో ఉంటాయి. 2022 జనవరి నుంచి ధరల్లో మార్పులుంటాయని కంపెనీ పేర్కొంది. ఈ కారును ప్యూర్‌, అడ్వెంచర్‌, అకంప్లీష్డ్‌, క్రియేటివ్‌ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు. సరికొత్త మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్లో టాటామోటార్స్‌ నిలదొక్కుకోవడానికి పంచ్‌ను విడుదల చేసింది. మారుతీ సుజుకీ ఎస్‌ప్రెస్సో, వేగన్‌ ఆర్‌, రేనాల్ట్‌ క్విడ్‌ వంటి వాహనాలు ఇప్పటికే ఈసెగ్మెంట్లో ఉన్నాయి. కొత్త పంచ్‌ .. మారుతీ సుజుకీ ఇగ్నీస్‌, స్విఫ్ట్‌, హ్యూందాయ్‌ ఐ10 నియోస్‌కు కూడా బలమైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ కారు భద్రతలో గ్లోబల్‌ ఎన్‌సీఏపీ 5స్టార్‌ రేటింగ్‌ను సాధించింది.

ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్‌ స్వీకరణను ప్రారంభించారు. ఇందుకోసం రూ.21వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఏఎల్‌ఎఫ్‌ఏ ఏఆర్‌సీ ప్లాట్‌ఫామ్‌పై కంపెనీకి చెందిన ఇంపాక్ట్‌ 2.0 డిజైన్‌ను వాడి తయారు చేశారు. సరికొత్త పంచ్‌ కారు బేబీ సఫారీ లుక్స్‌లో ఆకర్షణీయంగా ఉంది.

ఈ కారుకు 16 అంగుళాల డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్‌ను, డ్యూయల్‌టోన్‌ బాడీ కలర్‌, తీర్చిదిద్దిన టెయిల్‌ లైట్‌, డ్యూయల్‌ టోన్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ క్యాబిన్‌, ఆల్ట్రోజ్‌లో వాడిన 7 ఇంచ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌,7.0 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, హార్మన్‌ ట్యూన్డ్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే, ఐఆర్‌ఏ కనెక్టెడ్‌ కార్‌ టెక్‌, స్టార్ట్‌-స్టాప్‌ బటన్‌, ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, ఆటోఫోల్డింగ్‌ వింగ్స్‌ మిర్రర్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, కోల్డ్‌ గ్లోవ్‌ బాక్స్‌, ఆటో సెన్సింగ్‌ వైపర్స్‌, ఆటో హెడ్‌లైట్స్‌, 366 లీటర్స్‌ బూట్‌ స్పేస్‌ను ఇచ్చారు.

పంచ్‌లో 1.2లీటర్‌ రెవట్రాన్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. 5స్పీడ్‌ మాన్యూవల్‌ గేర్‌ బాక్స్‌, 5స్పీడ్‌ ఆటో వెర్షన్‌ను ఆప్షనల్‌గా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని