Tata Punch Micro SUV: టాటా పంచ్‌ ఆవిష్కరణ..!

దేశీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థ టాటా మోటార్స్‌ సరికొత్త మైక్రో ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్‌ స్వీకరణను ప్రారంభించింది. ఇందుకోసం రూ. 21వేలు చెల్లించాల్సి ఉంది.

Published : 04 Oct 2021 17:23 IST

 సరికొత్త మైక్రో ఎస్‌యూవీ వివరాలు వెల్లడి

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థ టాటా మోటార్స్‌ సరికొత్త మైక్రో ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్‌ స్వీకరణను ప్రారంభించింది. ఇందుకోసం రూ. 21వేలు చెల్లించాల్సి ఉంది. ఏఎల్‌ఎఫ్‌ఏ ఏఆర్‌సీ ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ చెందిన ఇంపాక్ట్‌ 2.0 డిజైన్‌ను వాడి తయారు చేశారు. ఈ పండుగల సీజన్‌లో ధరను ప్రకటించవచ్చు. వాస్తవానికి టాటా ప్రదర్శించిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన హెచ్‌బీఎక్స్‌ కాన్సెప్ట్‌ లైన్‌లోనే ఈ కారు ప్రొడక్షన్‌ వెర్షన్‌ ఉంది. సరికొత్త పంచ్‌ కారు బేబీ సఫారీ లుక్స్‌లో ఆకర్షణీయంగా ఉంది. 

అదిరిపోయే ఫీచర్లతో సిద్ధం..

ఈ కారుకు 16 అంగుళాల డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్‌ను, డ్యూయల్‌టోన్‌ బాడీ కలర్‌, తీర్చిదిద్దిన టెయిల్‌ లైట్‌, డ్యూయల్‌ టోన్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ క్యాబిన్‌, ఆల్ట్రోజ్‌లో వాడిన 7 ఇంచ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌,7.0 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, హార్మన్‌ ట్యూన్డ్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే, ఐఆర్‌ఏ కనెక్టెడ్‌ కార్‌ టెక్‌, స్టార్ట్‌-స్టాప్‌ బటన్‌, ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, ఆటోఫోల్డింగ్‌ వింగ్స్‌ మిర్రర్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, కోల్డ్‌ గ్లోవ్‌ బాక్స్‌, ఆటో సెన్సింగ్‌ వైపర్స్‌, ఆటో హెడ్‌లైట్స్‌, 366 లీటర్స్‌ బూట్‌ స్పేస్‌ను ఇచ్చారు. 
పంచ్‌లో 1.2లీటర్‌ రెవట్రాన్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. 5స్పీడ్‌ మాన్యూవల్‌ గేర్‌ బాక్స్‌, 5స్పీడ్‌ ఆటో వెర్షన్‌ను ఆప్షనల్‌గా ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని