విరాళాల‌పై ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 GGC, 80 G, 80 GGA ప్ర‌కారం విరాళాల‌పై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. స్వచ్ఛంద సంస్థల‌కు డొనేష‌న్లు ఇచ్చే మొత్తం పై పన్ను ప్రయోజనాలను పొంద‌వ‌చ్చు. ..

Published : 25 Dec 2020 15:21 IST

ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 GGC, 80 G, 80 GGA ప్ర‌కారం విరాళాల‌పై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. స్వచ్ఛంద సంస్థల‌కు డొనేష‌న్లు ఇచ్చే మొత్తం పై పన్ను ప్రయోజనాలను పొంద‌వ‌చ్చు. ఆదాయ పన్ను చట్టం, 1961 కింద కొంత పన్ను మినహాయింపులను అందించడం ద్వారా ఆదాయపన్ను శాఖ స్వచ్ఛంద సంస్థ కోసం విరాళాలను ప్రోత్సహిస్తుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసేందుకు ఆదాయపు పన్ను చట్టంలో 80 జీజీసీ, 80 జీ 80 జీజీఏ మూడు సెక్ష‌న్లు ఉన్నాయి. ఈ సెక్షన్లకు 80సీలో 1.5 లక్షల ప‌రిమితి ఉన్న విధంగా గ‌రిష్ట ప‌రిమితి లేదు.

రాజకీయ పార్టీలకు లేదా ఎల‌క్టోర‌ల్ ట్ర‌స్టుకు విరాళం: కీలకమైన ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు, ఎల‌క్టోర‌ల్ ట్రస్ట్లు , రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చేదానిపై కొంత పన్ను ప్రయోజనం ఇస్తాయ‌ని గ‌మ‌నించండి. పారదర్శకంగా ఎన్నిక‌ల‌ నిధుల వ్యవస్థ ఉండాల‌నే ఉద్దేశంతో 2017 బడ్జెట్లో ఎన్నికల బాండ్ల అంశాన్ని తీసుకొచ్చారు. పారదర్శకత మాత్రమే కాకుండా, ఆదాయపు పన్ను చట్టం పన్ను ప్రయోజనం కూడా కల్పిస్తుంది. ఆస‌క్తి ఉన్నవారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల నుంచి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయవచ్చు.

రాజకీయ పార్టీలు,ఎల‌క్టోర‌ల్ ట్రస్ట్లకు విరాళం ఇవ్వడం ద్వారా రెండు సెక్ష‌న్ల‌ కింద‌ మినహాయింపు పొందవచ్చు. వ్యక్తులు అయితే సెక్షన్ 80జీజీసీ సంస్థలు అయితే 80 జీజీడీ కింద ప‌న్ను మినహాయింపులు పొందవచ్చు. మొత్తం విరాళం మిన‌హాయింపుకు అర్హమైనది.

మ‌త సంబంధిత సంస్థ‌ల‌కు చారీటీలకు ఇచ్చే విరాళాలు: ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80జీ కింద మ‌త సంబంధిత సంస్థ‌ల‌కు చారీటీలకు ఇచ్చే విరాళాలపై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అయితే మ‌నం విరాళం ఇచ్చే సంస్థ క‌మీష‌న‌ర్ ఆఫ్ ఇన్‌క‌మ్ ట్యాక్స్ తో గుర్తింపు పొంది ఉండాలి. రూ. 2000 విరాళం మించితే ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు వీలుండ‌దు. కొన్ని సంస్థ‌ల‌కు విరాళాలు ప‌రిమితిలేకుండా ఇవ్వొచ్చు.

ఇండియా వైల్డ్లైఫ్ కన్సర్వేషన్ ట్రస్ట్( బెంగళూరు), మోడల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ (ఔరంగాబాద్), నేషనల్ డిఫెన్స్ ఫండ్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ మొద‌లైన సంస్థ‌లు మొద‌లైన‌వి. సెక్ష‌న్ 80జీ ప్ర‌కారం కొన్ని సంస్థలకు విరాళంగా ఇచ్చిన 100% మొత్తంలో మినహాయింపు, కొన్ని సంస్థలకు మొత్తం విరాళంలో 50% ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

పరిశోధన, అభివృద్ధికి విరాళం: మీరు సెక్షన్ 80 జీజీఏ కింద సమాజంలో శాస్త్రీయ అభివృద్ధికి తోడ్పడే సంస్థ‌ల‌కు విరాళం ఇవ్వ‌డం ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. శాస్త్రీయ పరిశోధన లేదా సాంఘిక శాస్త్రం లేదా గణాంక పరిశోధన ఏ సంస్థ‌కు డబ్బును మీరు విరాళంగా ఇచ్చే సంస్థను జాగ్రత్తగా చూసుకోవాలి

సెక్షన్ 80 జీజీఏ ప్ర‌కారం ఆదాయపన్ను శాఖ ఆమోదం పొందిన ఆ సంస్థలకు విరాళం ఇస్తేనే ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్), రాజీవ్ గాంధీ ఫౌండేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లు ఈ కేటగిరీలో వస్తాయి. విరాళాలుగా ఇచ్చే మొత్తంపై 100% ప‌న్ను మిన‌హాయింపు అందుకుంటారు. నగదు విరాళాలు రూ. 10,000 కి మించితే ప‌న్ను ప్ర‌యోజనం వ‌ర్తించ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని