ఈ ప‌థ‌కాల నుంచి విత్‌డ్రా చేసుకుంటే ఎంత ప‌న్ను?

డబ్బు అవసరాలకోసం ఉద్యోగులు పెట్టుబ‌డుల నుంచి ఉపసంహరించుకోవాల్సి వస్తోంది  

Published : 18 Dec 2020 15:34 IST

కోవిడ్- 19 కారణంగా అనేక మంది జీతాల్లో, ఉద్యోగాల్లో కోత విధించడం జరుగుతోంది . ఈ సమయంలో డబ్బు అవసరాలకోసం ఉద్యోగులు తాము పన్ను మినహాయింపు కోసం చేసిన పెట్టుబడులు -ఈపీఎఫ్, పీపీఎఫ్ , ఎన్ఎస్‌సి, ఎన్‌పీఎస్‌ , ఫంక్సెడ్ డిపాజిట్ వంటి వాటి నుంచి ఉపసంహరించుకోవాల్సి వస్తోంది . అయితే అటువంటి సమయంలో వర్తించే పన్ను, పెనాల్టీ , పరిమితుల గురించి తెలుసుకోవాలి.

పీపీఎఫ్ , ఈపీఎఫ్ ఉపసంహరణ :
ఈ రెండు పధకాలకు - 3 రకాల మినహాయింపులు వుంటాయి . ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ 1.50 లక్షల వరకు చేసిన పెట్టుబడిఫై ఆదాయపు పన్ను సెక్టన్ 80సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది . ప్రతి ఏడాది జమ అయ్యే వడ్డీ ఫై అలాగే నగదు ఉపసంహరణ సమయంలో మినహాయింపు లభిస్తుంది .

పీపీఎఫ్ ఖాతా తెరిచిన ఏడాది నుంచి 15 ఏళ్ళు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. 5 వ ఏడాది నుంచి పాక్షిక నగదు ఉపసంహరణకు అనుమతి వుంటుంది . ఇది నిల్వలో గరిష్టంగా 50 శాతం వుంటుంది. అలాగే 5 ఏళ్ల తరువాత తీవ్ర అనారోగ్య కారణంగా కూడా ఖాతా మూసివేయవచ్చు.

ఈపీఎఫ్ ఖాతా కు కూడా 5 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ వుంటుంది . అయితే తీవ్ర అనారోగ్య వంటి కారణాల వలన 5 ఏళ్ల కంటే ముందే నగదు పొందొచ్చు . ప్రస్తుత కోవిద్ 19 సమయంలో వైద్య ఖర్చుల కోసం నగదు పొందొచ్చు . ఇది ఖాతాలో నిల్వలో 75 శాతం గానీ, లేదా 3 నెలల జీతం (బేసిక్ + డిఏ) లలో ఏది తక్కువయితే అది . పీపీఎఫ్ , ఈపీఎఫ్ ఖాతాలనుంచి మెచ్యూరిటీ కే ముందే నగదు పొందే సౌకర్యం ఉంది. అలాగే పన్ను వర్తింపు విషయంలో మినహాయింపులు ఉన్నాయి. కాబట్టి పరిమితులకు లోబడి నగదు పొందేందుకు మంచివి .

ఎన్‌పీఎస్‌ :
ఈ ప‌థ‌కానికి కూడా 3 రకాల మినహాయింపులు వుంటాయి . సభ్యుని 60వ ఏట జమ అయిన సొమ్ము నుంచి 60 శాతం నగదు పొందొచ్చు. దీనిపై పన్ను వుండదు . మిగిలిన 40 శాతం యాన్యుటీ కోసం పెట్టుబడి చేయాల్సి ఉంటుంది . కోవిడ్‌- 19 ను కూడా తీవ్ర ప్రాణాంతక రోగంగా పరిగణించారు. కాబట్టి కోవిద్ 19 వైద్య ఖర్చుల కోసం ఎన్ పీ ఎస్ నుంచి నగదు పొందొచ్చు. ఖాతా తెరిచిన 3 ఏళ్ల తరువాత నుంచి నగదు పొందొచ్చు. అలాగే సభ్యుడు జమ చేసిన మొత్తంలో 25 శాతం వరకు మాత్రమే పొందొచ్చు. ఈ ఉపసంహరణ ఫై ప్ పన్ను వర్తించదు .

షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ అమ్మకాలు: కొన్న నాటి నుంచి ఏడాది లోపు అమ్మినట్లయితే , వచ్చిన లాభంపై 15 శాతం స్వల్పకాలిక మూలధన రాబడి (STCG) పన్ను వర్తిస్తుంది . అదే కొన్ననాటి నుంచి ఏడాది తరువాత అమ్మితే , రూ 1 లక్ష దాటిన రాబడి మీద 10 శాతం దీర్ఘకాలిక మూలధన రాబడి (LTCG) పన్ను వర్తిస్తుంది . ఇండెక్సేషన్ (indexation ) బెనిఫిట్ ఉండదు .

ఈక్విటీ కాని పెట్టుబడులను ఏడాది లోపు అమ్మితే , వచ్చిన రాబడి ని వ్యక్తి పన్ను స్లాబ్ ప్రకారం లెక్కిస్తారు . ఏడాది తరువాత అమ్మితే ఇండెక్సేషన్ (indexation ) బెనిఫిట్ తో 20 శాతం పన్ను వర్తిస్తుంది .

ఫిక్సెడ్ డిపాజిట్ ఉపసంహరణ :
ఫిక్సెడ్ డిపాజిట్ ఫై లభించే వడ్డీపై పన్ను వర్తిస్తుంది. ఫిక్సెడ్ డిపాజిట్ అసలు సొమ్ము ఉపసంహరణఫై ఎటువంటి పన్ను ఉండదు . అయితే ముందస్తు ఉపసంహరణ వలన వడ్డీ శాతం తగ్గడంతోపాటు,బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్ పెనాల్టీ కూడా విధించవచ్చు . మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే ముందు పరిమితులు, పేనల్ చార్జీలు, పన్ను వర్తింపు వంటి
విషయాల గురించి తెలుసుకోవాలి .

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని