Tax : స్థిరాస్తి, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టారా? పన్ను రేట్లు ఇలా ఉంటాయి!

మరి వివిధ రకాల ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే రాబడిపై పన్నులు ఎలా ఉంటాయో చూద్దాం....

Updated : 20 Oct 2021 12:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌

ఒక ఆస్తిని కొనుగోలు చేసిన‌ప్పుడు చెల్లించిన ధ‌ర కంటే.. ఎక్కువ ధ‌ర‌కు అమ్మితే వ‌చ్చిన లాభాన్ని మూల‌ధ‌న రాబ‌డి అంటారు. ఆస్తి మన దగ్గర ఉన్న వ్యవధిని బట్టి దీన్ని స్వల్పకాలిక మూలధన రాబడి, దీర్ఘకాలిక మూలధన రాబడి.. అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. దీన్ని బట్టే వీటిపై పన్ను ఉంటుంది. అయితే, కొన్ని ఆస్తులు క్యాపిటల్‌ గెయిన్స్‌ పరిధిలోకి రావు. ఉదాహరణకు బిజినెస్‌ కోసం కొనుగోలు చేసే ముడి సరకు, వ్యవసాయ భూమి సహా కొన్ని రకాల బాండ్లు, బంగారం కూడా ఈ పరిధిలోకి రావు. మరి వివిధ రకాల ఆస్తులపై వర్తించే పన్నులు ఎలా ఉంటాయో చూద్దాం..!


ఈక్విటీ షేర్లు

దేశీయ ఈక్విటీ షేర్లు

ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ఈక్విటీ షేర్లు మూలధన ఆస్తిగా పరిగణిస్తారు. వీటిని అమ్మితే వచ్చే లాభంపై పన్ను వర్తిస్తుంది. ఈక్విటీ షేర్లు లిస్టెడ్ (స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో నమోదైనవి)‌, అన్‌లిస్టెడ్‌ (స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో నమోదుకానివి) అని రెండు రకాలు.

విదేశీ ఈక్విటీ షేర్లు

భారతీయులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లు విదేశీ స్టాక్ మార్కెట్లలో మదుపు చేయొచ్చు. అయితే, వీటిని అన్‌లిస్టెడ్‌ షేర్ల కింద పరిగణిస్తారు. పన్ను రేట్లు ఇలా ఉంటాయి..


మ్యూచువల్‌ ఫండ్లు

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లు

 

హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్లు

ఈ కేటగిరీలో ఈక్విటీ, డెట్‌ సహా మరికొన్ని ఇతర అసెట్‌ క్లాసెట్‌ కలిపి ఉంటాయి. ఇక పన్ను రేట్ల విషయానికి వస్తే.. మన పెట్టుబడులు ఏ వర్గంలో అధికంగా ఉన్నాయన్న దాన్ని బట్టి నిర్ణయిస్తారు. 

* ఒక వేళ మన పెట్టుబడుల్లో 65 శాతం కంటే ఎక్కువ ఈక్విటీల్లో ఉంటే దానికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లకు వర్తించిన పన్ను రేట్లే వర్తిస్తాయి. 

* ఒక వేళ మన పెట్టుబడుల్లో 65 శాతం కంటే ఎక్కువ డెట్‌లో ఉంటే ఆ హైబ్రిడ్‌ ఫండ్‌కి డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లకు వర్తించిన పన్ను రేట్లే వర్తిస్తాయి.

ఇంటర్నేషనల్‌ మ్యూచువల్‌ ఫండ్లు


ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు(ఈటీఎఫ్‌)

వీటిలో ఇండెక్స్‌, సెక్టోరల్‌, బంగారం, అంతర్జాతీయ అని నాలుగు రకాలు ఉన్నాయి. 

ఇండెక్స్‌, సెక్టోరల్‌ ఈటీఎఫ్‌లకు పన్ను రేట్లు ఇలా ఉన్నాయి

గోల్డ్‌, ఇంటర్నేషనల్‌ ఫండ్లు


స్థిర ఆదాయ పెట్టుబడి సాధనాలపై పన్ను

బాండ్లు


స్థిరాస్తి

* ఈ మధ్య రీట్స్‌(రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌) మార్గాన రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం పెరిగింది. దీనిపై పన్ను రేట్లు ఇలా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని