మీ విద్యా రుణంపై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుందా?

బ్యాంకు, ఆమోదించిన స్వచ్ఛంద సంస్థ లేదా 'నోటిఫైడ్' ఆర్థిక సంస్థ నుంచి రుణం తీసుకోవాలి

Updated : 06 Mar 2021 12:44 IST

రుణగ్రహీత ఉన్నత చదువుల కోసం తీసుకున్న విద్యా రుణంలో వడ్డీపై సెక్షన్ 80ఈ కింద మినహాయింపు పొందవచ్చు. విద్యార్థి, లేదా దగ్గరి బంధువు - జీవిత భాగస్వామి, పిల్లలు లేదా చట్టపరమైన సంరక్షకుడు - ఎనిమిది సంవత్సరాల వరకు ఈ మిన‌హాయింపు పొందవచ్చు.
  బ్యాంకింగేత‌ర‌ ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) నుంచి విద్యా రుణాలు పన్ను మినహాయింపు అర్హత పొందకపోవచ్చు. రుణగ్రహీత ప్రయోజనం పొందటానికి,  ప్రభుత్వ-నోటిఫైడ్ ఆర్థిక సంస్థ నుంచి మాత్ర‌మే రుణం తీసుకొని ఉండాలి.

బ్యాంకు, ఆమోదించిన స్వచ్ఛంద సంస్థ లేదా 'నోటిఫైడ్' ఆర్థిక సంస్థ నుంచి రుణం తీసుకోవాలి అని నిబంధనలు చెప్తున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) నోటిఫై చేసిన ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం తీసుకుంటే మాత్రమే రుణగ్రహీతలు పన్ను మినహాయింపు పొందవచ్చు.  

రుణగ్రహీత ఉన్నత చదువుల కోసం తీసుకున్న విద్యా రుణంలోని వడ్డీ భాగంపై సెక్షన్ 80ఈ కింద మినహాయింపు పొందవచ్చు. విద్యార్థి, లేదా దగ్గరి బంధువు (జీవిత భాగస్వామి, పిల్లలు లేదా చట్టపరమైన సంరక్షకుడు) ఎనిమిది సంవత్సరాల వరకు దీనిపై మిన‌హాయింపు పొందవచ్చు.
ఉన్నత విద్య కోసం రుణాలు తీసుకోవడం అనేది ఒక వ్యక్తి తన జీవితకాలంలో పొందే పెద్ద రుణాలలో ఒకటి. గృహ రుణం మాదిరిగానే, పన్ను మినహాయింపు విద్యా రుణం భారాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది.

కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల‌ను మాత్రమే సీబీడీటీ జాబితాలో ఉన్నాయి.  ఈ విష‌యం  చాలామందికి తెలియక‌పోవ‌చ్చు.  సీబీడీటీ తెలియజేయని ఎన్‌బీఎఫ్‌సీ నుంచి తీసుకున్న రుణంపై మిన‌హాయింపును సీబీడీటీ అనుమ‌తించ‌దు. దీంతో రిట‌ర్నులు దాఖ‌లు చేసే స‌మ‌యంలో అవ‌క‌త‌వ‌క‌లు ఏర్ప‌డ‌వ‌చ్చు. రుణగ్రహీత పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ప్రకటించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది.  పన్ను బాధ్యత ప్రకటించిన దానికంటే ఎక్కువగా ఉందని పన్ను అధికారి ఎత్తి చూపుతారు. ఇది ఆదాయాన్ని దాచ‌డం లేదా స‌రైన వివ‌రాల‌ను అందించ‌క‌పోవ‌డంగా ప‌రిగ‌ణించి సెక్ష‌న్ 270ఏ కింద జ‌రిమానా కూడా విధించ‌వ‌చ్చు.
 అందుకే మీరు ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీలో విద్యా రుణం తీసుకోవాల‌నుకుంటే అది నోటిఫైడ్ చేసిందో లేదో తెలుసుకోవాలి. ఇప్ప‌టికే రుణం తీసుకున్న‌ట్ల‌యితే ఈ వివ‌రాలు తెలియ‌క‌పోతే సంస్థ అధికారిక మెయిల్  ద్వారా సందేహాన్ని నివృత్తి చేసుకోండి. క‌స్ట‌మ‌ర్ ఎగ్జిక్యూటివ్‌తో ఫోన్ మాట్లాడ‌టం కంటే నేరుగా మెయిల్ ద్వారా స‌మాచారాన్ని పొంద‌డం మేలు. 

 మీరు రుణం తీసుకున్న ఎన్‌బీఎఫ్‌సీ సీబీడీటీ నోటీఫైడ్ జాబితాలో లేక‌పోతే సెక్షన్ 80ఈ కింద మినహాయింపు తీసుకోకండి. మీ కోర్సు పూర్తి చేసి, మీ రెగ్యులర్ ఈక్వేటెడ్ నెలవారీ వాయిదా లేదా ఈఎంఐ ప్రారంభించినట్లయితే  విద్యా రుణాన్ని బ్యాంకుకు మార్చుకోవ‌డం మ‌రో ఆప్ష‌న్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని