ఇకపై పోస్టాఫీస్‌లోనూ ఐటీఆర్ దాఖ‌లు 

పన్ను చెల్లింపుదారుల కోసం  ఇండియా పోస్ట్ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది

Updated : 17 Jul 2021 18:31 IST

ఇంటర్నెట్‌డెస్క్:   పన్ను చెల్లింపుదారులకు  ఇండియా పోస్ట్  శుభవార్త అందించింది. సమీప పోస్టాఫీసు సేవా కేంద్రాల్లో (సీఎస్‌సీ) ఐటీఆర్ దాఖలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ మ‌రింత‌ సులభం అవుతుంది. ఈ విషయంలో ఇండియా పోస్ట్ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వేత‌న‌జీవుల‌ ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇదో పెద్ద ఉపశమనం.

ఇండియా పోస్ట్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.  ‘మీ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. మీ సమీప పోస్టాఫీసు సీఎస్‌సీ కౌంటర్లో ఆదాయపు పన్ను రిటర్నుల‌ను సుల‌భంగా దాఖ‌లు చేయ‌వ‌చ్చు’ అని ప్ర‌క‌టించింది.

తపాలా, బ్యాంకింగ్, బీమా సేవలు వంటి వివిధ ఆర్థిక సేవల కోసం దేశవ్యాప్తంగా పోస్టాఫీస్  సీఎస్‌సీ కౌంటర్లు పనిచేస్తాయి. వీటి ద్వారా ఒక వ్యక్తి అనేక ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు, సమాచారాన్ని పొందవచ్చు. ఇది కాకుండా, భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద భారతీయ పౌరులకు వివిధ ఈ-సేవలను కూడా అందిస్తుంది.  అయితే ఆన్‌లైన్‌లో రిట‌ర్నులు దాఖ‌లు చేసుకోగ‌లిగేవారు కొత్త ఆదాయపు పన్ను వెబ్‌సైట్ - www.incometax.gov.in లో లాగిన్ అవ్వడం ద్వారా ఐటీఆర్‌ను దాఖలు చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని