ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై ఎంత ప‌న్ను చెల్లించాలి?

మార్కెట్‌లో చాలా ర‌కాల ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డి ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఒకే రకంగా ఉండ‌వు. కానీ అన్నింటిలో రిస్క్ మాత్రం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు..

Published : 24 Dec 2020 17:20 IST

పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్ ఫండ్ల పెట్టుబ‌డులు కూడా ఉంటే రిస్క్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. పెట్టుబ‌డుల్లో వివిధ ర‌కాలు ఉన్న‌ప్ప‌టికీ ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై అధిక రాబ‌డి వ‌స్తుంద‌నేది నిజం. అందుకే పెట్టుబ‌డుదారుల పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ భాగం ఈక్విటీల‌కు కేటాయిస్తారు. ఈక్విటీ పెట్టుబ‌డుల్లో రిస్క్ ఉన్న‌ప్ప‌టికీ, దీర్ఘ‌కాలంగా కొన‌సాగిస్తే రిస్క్‌ను అధిగ‌మించ‌వ‌చ్చు.

మార్కెట్‌లో చాలా ర‌కాల ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డి ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఒకే రకంగా ఉండ‌వు. కానీ అన్నింటిలో రిస్క్ మాత్రం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు బీమా హామీని అందించ‌వు. కానీ, యులిప్ ప్లాన్‌లో పెట్టుబ‌డుల‌తో పాటు బీమా హామీ ల‌భిస్తుంది. దీంతో పాటు ఈక్విటీల‌కు వ‌ర్తించే ప‌న్నులు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు క్యాపిట‌ల్ గెయిన్స్ ట్యాక్స్ ఎంత కాలం పెట్టుబ‌డులు కొన‌సాగించారో దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది. స్టాక్స్‌, మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఏడాది కంటే ఎక్కువ‌కాలం కొన‌సాగితే దీర్ఘ‌కాలికంగా ప‌రిగ‌ణిస్తారు, కానీ యులిప్స్‌కి ఇది వ‌ర్తించ‌దు.

ప‌థ‌కాల‌పై వ‌చ్చే రాబ‌డి ప‌న్నుల రూపంలో త‌గ్గుతుంది. వేర్వేరు ఈక్విటీ ప‌థ‌కాలకు వేర్వేరు ప‌న్నులు వ‌ర్తిస్తాయి. పెట్టుబ‌డులు పెట్టేముందు ప‌న్నుల‌ను గురించి తెలుసుకొని ఏది స‌రిపోతుందో దానిని ఎంచుకోవ‌డం మంచిది.

ఈక్విటీల‌పై వ‌ర్తించే ప‌న్నుల‌ను ప‌రిశీలిస్తే..

Source: Livemint

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని