Tech Mahindra: టెక్‌ మహీంద్రా చేతికి అలీస్‌, గ్రీన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌

అలీస్‌ ఇండియా, గ్రీన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 100 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రముఖ ఐటీ(IT) సంస్థ టెక్‌ మహీంద్రా(Tech Mahindra) ప్రకటించింది....

Updated : 17 Aug 2022 15:41 IST

బెంగళూరు: అలీస్‌ ఇండియా, గ్రీన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 100 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రముఖ ఐటీ (IT) సంస్థ టెక్‌ మహీంద్రా (Tech Mahindra) ప్రకటించింది. ఈ లావాదేవీ విలువ 125 మిలియన్ డాలర్లు. పూర్తిగా నగదు రూపంలోనే చెల్లించనున్నారు. ఈ సంస్థలు అమెరికాలోని సియాటెల్‌ వేదికగా పనిచేస్తున్నాయి. ఈ సంస్థల్లో ప్రస్తుతం 660 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిసెంబరు 31, 2020 నాటికి ఈ సంస్థల ఆదాయం 39.6 మిలియన్‌ డాలర్లుగా ఉంది. 

తాజా కొనుగోలు ద్వారా టెక్‌ మహీంద్రాకు డిజిటల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సొల్యూషన్స్‌, లెర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఇన్‌స్ట్రక్షనల్‌ డిజైన్‌, ఇంజినీరింగ్‌, క్లౌడ్‌ అండ్‌ ఆటోమేషన్‌, బీఐ అండ్‌ అనలిటిక్స్‌, టెక్నికల్‌ సపోర్ట్‌ సిస్టమ్స్‌ వంటి రంగాల్లో అదనపు ప్రయోజనం చేకూరనుందని సంస్థ పేర్కొంది. అలీస్‌, గ్రీన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ టెక్నాలజీ కన్సల్టింగ్‌, మ్యానేజ్డ్‌ సర్వీసులను అందిస్తోంది. అలీస్‌ను 2018లో, గ్రీన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 2013లో స్థాపించారు. ఇటీవల టెక్‌ మహీంద్రా కాస్త చురుగ్గా కొనుగోళ్లు (acquisitions) చేపడుతోంది. ఇటీవలే ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తున్న యాక్టీవైరస్‌ కనెక్ట్‌ను 62 మిలియన్‌ డాలర్లను కొనుగోలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని