5జీ అమలు జాతీయ ప్రాధాన్యం కావాలి: ముకేశ్‌ అంబానీ

దిల్లీ: భారత్‌లో 5జీ సాంకేతికత అమలు జాతీయ ప్రాధాన్యం కావాల్సిన అవసరం ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అన్నారు. అప్పుడే డిజిటల్‌ ఇండియా కల సంపూర్ణమవుతుందన్నారు. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

వీలైనంత త్వరగా భారత్‌ 2జీ నుంచి 4జీ, 5జీకి బదిలీ కావాలని అంబానీ అన్నారు. అప్పుడే అట్టడుగున ఉన్నవారికి కూడా డిజిటల్‌ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు అందుతాయన్నారు. భారత్‌లో మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ వేగంగా విస్తరించడానికి అందుబాటులో ఉండే ధరలే కీలకమనే విషయాన్ని విస్మరించొద్దన్నారు. యుద్ధ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఫైబర్‌ అనుసంధానతను చేపట్టాలని కోరారు.

ఆ లక్ష్యంలో మొబైల్‌ పరిశ్రమది కీలక పాత్ర: బిర్లా

2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల  ఆర్థిక వ్యవస్థను అందుకోవాలన్న భారతదేశ లక్ష్యంలో మొబైల్‌ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని ఆదిత్యా బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే డిజిటల్‌ ఇండియా కల సాకారానికి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టగలిగే పటిష్ఠమైన పరిశ్రమలు అవసరమని తెలిపారు. గత కొన్ని నెలల్లో ప్రభుత్వం పలు కీలక విధానపరమైన నిర్ణయాలతో పరిశ్రమకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. సులభతర వాణిజ్యం కోసం మరిన్ని చర్యలతో పాటు బ్యాంకింగ్‌ రంగం నుంచి మద్దతు లభిస్తే అత్యాధునిక సాంకేతికతల ఆవిష్కరణ, వినియోగంలో భారత్‌ మరింత ముందుంటుందని తెలిపారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని