Anand Mahindra: ‘ఐరన్‌మ్యాన్‌’ కల నెరవేర్చిన ఆనంద్‌ మహీంద్రా!

ఈ క్రమంలో మణిపూర్‌కు చెందిన ప్రేమ్‌ అనే యువకుడికి ఇచ్చిన హామీని ఆనంద్‌ మహీంద్రా నెరవేర్చారు...

Published : 17 Nov 2021 13:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా. కొత్త ఆవిష్కరణలు, నూతన వస్తువుల రూపకల్పనలో ఉండే శ్రమ గురించి.. నిత్యం నాణ్యమైన ఉత్పత్తుల కోసం పరితపించే ఆయనకంటే బాగా ఎవరికి తెలుస్తుంది? అందుకే గ్రామీణ యువతీయువకుల్లో ఉండే ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించేందుకు ముందుకు వస్తుంటారాయన.

ఈ క్రమంలో మణిపూర్‌కు చెందిన ప్రేమ్‌ అనే యువకుడికి ఇచ్చిన హామీని ఆనంద్‌ మహీంద్రా నెరవేర్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. ప్రేమ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్ చదివేందుకు తోడ్పాటునందించారు. హైదరాబాద్‌లోని మహీంద్రా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పించారు. ఈ విషయాన్ని ఆనంద్‌ మహీంద్రా స్వయంగా ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. అలాగే ప్రేమ్‌ ప్రయాణానికి సహకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

ప్రేమ్‌ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి ఐరన్‌ మ్యాన్‌ సూట్‌ నమూనాను తయారు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి శిక్షణ లేకుండా వాటిని రూపొందించాడు. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదవాలనుకుంటున్నానంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ఇది కాస్తా ఆనంద్‌ మహీంద్రా దృష్టిలో పడడంతో.. ప్రేమ్‌ కల నెరవేరినట్లైంది. ప్రేమ్‌ తోబుట్టువులకు కూడా సాయం చేస్తామని ఆనంద్‌ మాటిచ్చారు.

Read latest Business News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని