Audi Q5 facelift: భారత్‌లో ఆడీ క్యూ5 ఫేస్‌లిఫ్ట్‌ విడుదల.. ధర ఎంతంటే?

జర్మనీకి చెందిన విలాసవంతమై కార్ల తయారీ సంస్థ ఆడీ.. ఐదు సీట్ల ఎస్‌యూవీ క్యూ5లో ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను మంగళవారం విడదుల చేసింది....

Published : 23 Nov 2021 19:17 IST

ముంబయి: జర్మనీకి చెందిన విలాసవంతమై కార్ల తయారీ సంస్థ ఆడీ.. ఐదు సీట్ల ఎస్‌యూవీ క్యూ5లో ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను మంగళవారం విడుదల చేసింది. దీంట్లో టెక్నాలజీ, ప్రీమియం ప్లస్‌ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. దీని ధర రూ.58.93-63.77 లక్షలు(ఎక్స్‌షోరూం)గా నిర్ణయించారు. 2021లో భారత మార్కెట్‌లో ఆడీ విడుదల చేసిన తొమ్మిదో కారిది.

2.0 లీటర్‌ టీఎఫ్‌ఎస్‌ఐ ఇంజిన్‌ ఉండే ఈ కారు ఔరంగాబాద్‌లోని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేశారు. మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌సీ క్లాస్‌, బీఎండబ్ల్యూ ఎక్స్‌3, ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ స్పోర్ట్‌తో ఇది పోటీ పడనుంది. విస్తృతమైన ఇన్ఫోటైన్‌మెంట్‌ ఆప్షన్లు, అసిస్టెంట్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు రోజువారీ వినియోగానికి సరిగ్గా సరిపోతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. పార్క్‌ అసిస్ట్‌, కంఫర్ట్‌ కీ, వర్చువల్‌ కాక్‌పిట్‌ ప్లస్‌, 19 స్పీకర్‌ బీఅండ్‌ఓ ప్రీమియం 3డీ సౌండ్‌ సిస్టం వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వెల్లడించింది. వీటితో పాటు ఆడీ స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్ఫేస్‌, ఆడీ ఫోన్‌ బాక్స్‌ విత్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, ఎంఎంఐ నావిగేషన్‌ ప్లస్‌, ఎంఎంఐ టచ్‌, ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లను ఈ కారులో పొందుపరిచారు.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని