Auto Expo: ఆటో ఎక్స్‌పో వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

ఆసియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ ప్రదర్శనగా పేరొందిన భారత ‘ఆటో ఎక్స్‌పో’ వాయిదా పడింది. కరోనా వ్యాప్తి, మూడో వేవ్‌ అంచనాల నేపథ్యంలోనే ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరగాల్సిన ప్రదర్శనను...

Published : 02 Aug 2021 17:06 IST

దిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ ప్రదర్శనగా పేరొందిన భారత ‘ఆటో ఎక్స్‌పో’ వాయిదా పడింది. కరోనా వ్యాప్తి, మూడో వేవ్‌ అంచనాల నేపథ్యంలోనే 2022 ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరగాల్సిన ప్రదర్శనను వాయిదా వేస్తున్నట్లు ‘సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌ (సియామ్‌)’ ప్రకటించింది. ఈ ప్రదర్శన నిర్వహిస్తే అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపింది. అప్పుడు భౌతిక దూరం పాటించడం సహా ఇతర కొవిడ్‌ నిబంధనల్ని అమలు చేయడం కష్టతరమవుతుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆటో ఎక్స్‌పోను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ ఏడాది చివరలో తదుపరి ఆటో ఎక్స్‌పో తేదీలను ప్రకటిస్తామని స్పస్టం చేసింది. 2020 ఆటోఎక్స్‌పోకు ఆరు లక్షల మంది రావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని