BMW: అలా అయితేనే విద్యుత్తు వాహనాలకు భారత్‌లో గిరాకీ!

భారత్‌లో విద్యుత్తు వాహనాలకు గిరాకీ పెరగాలంటే ప్రభుత్వం తరఫున కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సూచించింది...

Published : 28 Nov 2021 17:39 IST

ప్రభుత్వానికి బీఎండబ్ల్యూ సూచన

దిల్లీ: భారత్‌లో విద్యుత్తు వాహనాలకు గిరాకీ పెరగాలంటే ప్రభుత్వం తరఫున కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సూచించింది. ఒక నిర్ణీత కాలం పాటు లేదా పరిమిత యూనిట్లపై దిగుమతి సుంకం తగ్గించాలని హితవు పలికింది. అప్పుడు గిరాకీ పెరుగుతుందని.. తద్వారా భారత్‌లో తయారీకి కంపెనీలు మొగ్గుచూపుతాయని తెలిపింది. ఈ క్రమంలో ఆధునిక సాంకేతికత సైతం భారత్‌కు బదిలీ అవుతుందని పేర్కొంది.

గత 15 ఏళ్లుగా తమ కంపెనీ భారత్‌లోనే పలు మోడళ్లను తయారు చేస్తోందని బీఎండబ్ల్యూ తెలిపింది. గిరాకీయే స్థానికంగా తయారీకి దోహదం చేస్తుందని పేర్కొంది. గిరాకీ పుంజుకుంటే మౌలిక వసతుల కల్పన కూడా జరుగుతుందని తెలిపింది. వచ్చే ఆరు నెలల్లో భారత్‌లో మూడు విద్యుత్తు కార్లను ప్రవేశపెట్టనున్నట్లు బీఎండబ్ల్యూ ఇటీవల ప్రకటించింది.  

పూర్తిస్థాయిలో విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60-100 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. ఇంజిన్‌ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని రూ.40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని