Bitcoin: 51 వేల డాలర్లకు చేరిన బిట్‌కాయిన్ విలువ

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ విలువ శుక్రవారం 51,000 డాలర్లను తాకింది....

Published : 24 Dec 2021 12:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్‌ విలువ శుక్రవారం 51,000 డాలర్లను తాకింది. ఇది రెండు వారాల గరిష్ఠం. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం నేపథ్యంలో బిట్‌కాయిన్‌ విలువ పెరిగినట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల్లో దీని విలువ 4 శాతం ఎగబాకి 51,524 డాలర్లకు చేరింది. ఇక బిట్‌కాయిన్‌ తర్వాతి స్థానంలో ఉన్న ఈథర్ విలువ 4,100 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. బిట్‌కాయిన్‌ రాణిస్తుండడంతో ఆసియాలో క్రిప్టో సంబంధిత స్టాక్స్‌ అయిన వూరీ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌, రెమిక్స్‌పాయింట్‌ వంటి కంపెనీల షేర్లు ఎగబాకాయి. 2021లో బిట్‌కాయిన్‌ ఇప్పటి వరకు 76 శాతం పెరగడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని