Citroen: ధరల పెంపు బాటలో సిట్రాన్‌

ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రాన్ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది....

Published : 07 Dec 2021 16:41 IST

దిల్లీ: ముడి పదార్థాల వ్యయాలు అధికమవుతున్నందున వాహన ధరలు పెంచేందుకు తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి, టాటా మోటార్స్‌, హోండా రెనో సంస్థలు కార్ల ధరల్ని జనవరి 1 నుంచి పెంచుతున్నామని ప్రకటించగా తాజాగా సిట్రాన్‌ కూడా ఇదే బాటను అనుసరించనుంది. తమ సంస్థ నుంచి వస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ సీ5 ఎయిర్‌క్రాస్‌ ధరను మూడు శాతం వరకు పెంచనున్నట్లు సిట్రాన్‌ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.31.3 లక్షలు(ఎక్స్‌షోరూం)గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని