Commercial gas cylinder: వాణిజ్య సిలిండర్‌పై మళ్లీ బాదుడు

దేశీయ చమురు సంస్థలు మరోసారి వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి. బుధవారం(డిసెంబర్‌ ఒకటో తేదీ) సిలిండర్‌పై రూ. 100.50 పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.

Updated : 01 Dec 2021 13:38 IST

దిల్లీలో సిలిండర్ ధర రూ.2,101

దిల్లీ: దేశీయ చమురు సంస్థలు మరోసారి వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి. బుధవారం (డిసెంబర్‌ ఒకటో తేదీ) సిలిండర్‌పై రూ.100.50 పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. దాంతో 19 కేజీల సిలిండర్ ధర ఇప్పటికే రూ.రెండు వేల రూపాయలు దాటగా.. ఈ పెంపుతో దిల్లీలో ఆ ధర రూ.2,101కి చేరింది. కాగా, పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. 

ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి రూ.1,734గా ఉన్న సిలిండర్ ధర .. నవంబర్ ఒకటో తేదీన ఒకేసారి రూ.266.50 మేర పెరిగింది. దాంతో నాటి నుంచి ఒక్క సిలిండర్ కొనాలంటే రూ.2,000.50 చెల్లించాల్సి వస్తోంది. తాజా పెరుగుదలతో ఆ మొత్తం రూ.2,101కి చేరింది. హోటళ్లు, రెస్టారెంట్లలో ఈ వాణిజ్య సిలిండర్లు వాడుతుంటారు. వీటి ధర పెరగడంతో బయట కొనుగోలు చేసే ఆహార పదార్థాల ధరలు కూడా పెరగనున్నాయి. అయితే చమురు సంస్థలు డొమెస్టిక్ సిలిండర్ ధరల్ని పెంచకపోవడం ఊరటనిస్తోంది. 

ఇతర నగరాల్లో వాణిజ్య సిలిండర్ ధరల వివరాలిలా..

దిల్లీ ... రూ.2,101

కోల్‌కతా ... రూ. 2,174

ముంబయి ... రూ.2,051

చెన్నై ... రూ.2,234

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని