Edible oils imports: వంటనూనెల దిగుమతుల విలువలో 63% వృద్ధి

131.31 లక్షల టన్నులతో వంటనూనెల దిగుమతులు 2020-21 మార్కెటింగ్‌ సంవత్సరం(నవంబరు-అక్టోబరు)లో స్థిరంగా ఉన్నాయి....

Published : 16 Nov 2021 20:00 IST

దిల్లీ: 2020-21 మార్కెటింగ్‌ సంవత్సరం(నవంబరు-అక్టోబరు)లో 131.31 లక్షల టన్నులతో వంటనూనెల దిగుమతులుస్థిరంగా ఉన్నాయి. గత ఆరేళ్లలో ఇది రెండో అత్యల్పం కావడం గమనార్హం. క్రితం ఏడాది దిగుమతులు 135.75 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. అయితే, క్రితం ఏడాది(రూ.71,625 కోట్లు)తో పోలిస్తే దిగుమతులు విలువ మాత్రం 63 శాతం పెరిగి రూ.1.17 లక్షల కోట్లకు ఎగబాకిందని ‘సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌(ఎస్‌ఈఏ)’ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఇదే సమయంలో వంటయేతర నూనెల ఎగుమతులు 3,99,822 టన్నులకు పెరిగింది.

క్రితం ఏడాది 4.21 లక్షల టన్నుల శుద్ధి చేసిన నూనెలను దిగుమతి చేసుకోగా.. ఈసారి అవి 6.86 లక్షల టన్నులకు పెరిగింది. అదే సమయంలో ముడి నూనె దిగుమతులు 127.54 లక్షల టన్నుల నుంచి 124.45 లక్షల టన్నులకు తగ్గింది. 2016-17లో 81:19గా ఉన్న ముడి, శద్ధి చేసిన నూనెల దిగుమతుల నిష్పత్తి 2020-21 నాటికి 95:5కి పెరిగింది. క్రూడ్‌ వెజ్‌ ఆయిల్స్‌ దిగుమతి పెరగడం వల్ల దేశీయంగా నూనె శుద్ధి కర్మాగారాల శుద్ధి సామర్థ్యం పెరిగింది. అదే సమయంలో ఉద్యోగ కల్పన సైతం ఎగబాకింది.

భారత్‌కు ఇండోనేసియా, మలేసియా నుంచి అధికంగా నూనె దిగుమతి అవుతోంది. ముడి సోయానూనె అర్జెంటీనా, బ్రెజిల్‌ నుంచి వస్తుండగా.. ఉక్రెయిన్‌, రష్యా, అర్జెంటీనా నుంచి ముడి పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతోంది.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని