Fixed deposits: హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌ కస్టమర్లకు శుభవార్త!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో గతకొంత కాలంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లు కనిష్ఠానికి పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో నష్టభయం ఏమాత్రం కోరుకోని మదుపర్లకు తీవ్ర నిరాశే మిగిలింది. అనివార్యంగా సిప్‌, మ్యూచువల్‌ ఫండ్ల వంటి పథకాల వైపు మళ్లాల్సి వచ్చింది. అలాంటి వారికి తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌ సంస్థలు తీపి కబురు చెప్పాయి. పలు కాలపరిమితులతో కూడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

భారత్‌లో అతిపెద్ద గృహరుణ సంస్థగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ దీర్ఘకాల డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో 33 నెలల కాలపరిమితితో కూడిన రూ.2 కోట్ల వరకు గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీరేటు ఇస్తోంది. 66 నెలల కాలపరిమితితో రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై 6.7శాతం, 99 నెలల కాలపరిమితికి 6.8 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. సీనియర్‌ సిటిజన్లకు మరో 0.25 శాతం అదనపు వడ్డీరేటు వర్తించనుంది. ఈ కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

మరోవైపు దేశంలో అతిపెద్ద కన్జ్యూమర్‌ ఫైనాన్సియర్‌గా పేరుగాంచిన బజాజ్‌ ఫైనాన్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను 30 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ పెంపు 24-35 నెలలు, 36-60 నెలల కాలపరిమితి గల డిపాజిట్లకు వర్తిస్తాయి. 12 - 23 నెలల కాలపరిమితితో కూడిన డిపాజిట్లపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేదు. దీంతో 24-35 నెలల కాలపరిమితితో రూ.5 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై 6.4 శాతం 36-60 నెలల కాలపరిమితితో చేసే వాటిపై 6.8 శాతం వడ్డీ లభించనుంది. ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షకు ముందు ఈ సంస్థలు వడ్డీరేట్లు పెంచడం గమనార్హం. ఇప్పటి వరకు సంక్షోభం నుంచి బయటపడేందుకు కీలక వడ్డీరేట్ల విషయంలో ఆర్‌బీఐ సర్దుబాటు వైఖరి కొనసాగిస్తూ వచ్చింది. ఇకపై ఈ ధోరణికి స్వస్తి పలకనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో చూడాల్సి ఉంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్