Unemployment: 4 నెలల గరిష్ఠానికి నిరుద్యోగిత.. అత్యధికంగా ఏ రాష్ట్రంలో అంటే?
దేశవ్యాప్తంగా డిసెంబరులో నిరుద్యోగం నాలుగు నెలల గరిష్ఠానికి పెరిగిపోయింది. నవంబరులో 7.0శాతంగా ఉన్న నిరుద్యోగ శాతం గత నెలలో 7.9 శాతానికి ఎగబాకింది...
దిల్లీ: దేశవ్యాప్తంగా డిసెంబరులో నిరుద్యోగం నాలుగు నెలల గరిష్ఠానికి పెరిగిపోయింది. నవంబరులో 7.0శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు(Unemployment Rate) గత నెలలో 7.9 శాతానికి ఎగబాకింది. ఆగస్టులో గరిష్ఠంగా 8.3 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విధిస్తున్న ఆంక్షలు ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడానికి కారణమైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగిత పెరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వినిమయ సెంటిమెంటు కూడా పడిపోయినట్లు సీఎంఐఈ తెలిపింది.
డిసెంబరులో పట్టణ ప్రాంతాల్లో 9.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 7.3 శాతం మేర నిరుద్యోగం నమోదైనట్లు సీఎంఐఈ తాజాగా విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. నవంబరులో ఇవి వరుసగా 8.2 శాతం, 6.4 శాతంగా ఉన్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగితే.. గత త్రైమాసికంలో పుంజుకున్న ఆర్థిక వ్యవస్థ తిరిగి తిరోగమనం దిశగా సాగే అవకాశం ఉందని అనేక మంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్‌లో 5.6 శాతం, తెలంగాణలో 2.2 శాతం నిరుద్యోగిత నమోదైంది. అత్యధికంగా హరియాణాలో 34.1 శాతం నిరుద్యోగ రేటు రికార్డయ్యింది. అత్యల్ప నిరుద్యోగ రేటు కర్ణాటకలో 1.4 శాతంగా ఉంది.
నిరుద్యోగిత ఎక్కువవున్న రాష్ట్రాలు...
హరియాణా - 34.1%
రాజస్థాన్ - 27.1%
ఝార్ఖండ్ - 17.3%
బిహార్ - 16.0%
జమ్మూకశ్మీర్ - 15.0%
నిరుద్యోగిత తక్కువగావున్న రాష్ట్రాలు...
కర్ణాటక - 1.4%
ఒడిశా - 1.6%
గుజరాత్ - 1.6%
ఛత్తీస్‌గఢ్ - 2.1%
తెలంగాణ - 2.2%
3 నెలల కనిష్ఠానికి తయారీ కార్యకలాపాలు
నవంబరులో 10 నెలల గరిష్ఠానికి చేరిన తయారీ కార్యకలాపాలు డిసెంబరులో నెమ్మదించాయి. మూడు నెలల కనిష్ఠానికి చేరిన మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(PMI) 55.5 శాతానికి చేరింది. నవంబరులో ఇది 57.6 శాతంగా నమోదైంది. పీఎంఐ 50 కంటే ఎక్కువ ఉంటే వృద్ధి.. తక్కువ ఉంటే క్షీణించినట్లుగా భావిస్తారు. ద్రవ్యోల్బణ భయాలు, సరఫరా గొలుసులోని ఇబ్బందులు, కొవిడ్-19 వ్యాప్తి తయారీ రంగంపై ప్రభావం చూపినట్లు ఈ గణాంకాలను విడుదల చేసే ఐహెచ్ఎస్ మార్కిట్ పేర్కొంది. ఇక ఎప్పటిలాగే ముడిపదార్థాల ధరలు, నిర్వహణ ఖర్చులు డిసెంబరులోనూ పెరిగాయి. అదే సమయంలో ఆర్డర్లు సైతం పెరగడం విశేషం. కొత్త క్లైంట్లు అధికంగా ఆర్డర్లు ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది. కొవిడ్ భయాలతో తయారీ కార్యకలాపాలపై కొంత ఆందోళనలు నెలకొన్నప్పటికీ.. ఉత్పత్తి మాత్రం పెరుగుతుందని ఐహెచ్ఎస్ మార్కిట్ భారత ప్రతినిధి లీమా అంచనా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
-
పార్ట్‌టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM