Kia Car: వచ్చే ఏడాది కియా కొత్త కారు.. ఎలా ఉండనుందంటే..?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా భారత్‌లో తమ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసే దిశగా సాగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కేవై కోడ్‌నేమ్‌తో పిలుస్తోన్న కొత్త మోడల్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి....

Published : 16 Nov 2021 17:02 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా భారత్‌లో తమ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసే దిశగా సాగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ‘కేవై’ కోడ్‌నేమ్‌తో పిలుస్తోన్న కొత్త మోడల్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. డిసెంబరు 16న దీన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కంపెనీ భారత్‌లో సెల్టోస్‌, సోనెట్‌, కార్నివాల్‌ పేరిట మూడు మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. భారత్‌లో ఫ్యామిలీ కారుకు డిమాండ్‌ ఉన్నట్లు తమ పరిశోధనలో గ్రహించామని.. అందుకనుగుణంగానే కొత్త కారును డిజైన్‌ చేసినట్లు కియా ఇండియా ఎండీ, సీఈఓ తే-జిన్‌ పార్క్‌ తెలిపారు. ఈ విభాగంలో ఇప్పటికే ఉన్న 6-7 సీటర్లు కాకుండా.. కొత్త సెగ్మెంట్‌ను తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో కియా కార్లు అతితక్కువ కాలంలో విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే. కేవలం రెండేళ్లలోనే మూడు లక్షల కార్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జులైలో కంపెనీ ఈ మైలురాయిని చేరుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని