Fertilisers: దేశంలో ఎరువుల కొరత లేదు: కేంద్రం

దేశంలో ఎరువుల కొరత ఏమాత్రం లేదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ తెలిపారు....

Published : 03 Dec 2021 17:27 IST

దిల్లీ: దేశంలో ఎరువుల కొరత ఏమాత్రం లేదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ తెలిపారు. కీలకమైన డీఏపీని కావాల్సిన మేరకు ఇప్పటికే సిద్ధం చేసి ఉంచినట్లు వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు శుక్రవారం లిఖిపూర్వక సమాధానం ఇచ్చారు.

రబీ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు 34.64 కోట్ల టన్నుల డీఏపీని కోరగా.. కేంద్ర రసాయన శాఖ 36.60 లక్షల టన్నులను అందుబాటులో ఉంచిందని తెలిపారు. అయినప్పటికీ రాబోయే సీజన్‌కు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. రాష్ట్రాలకు 45 కేజీల యూరియాను రూ.242 గరిష్ఠ చిల్లర ధరకు అందిస్తున్నట్లు గుర్తుచేశారు. ఏప్రిల్‌-అక్టోబరు మధ్య 29.59 లక్షల టన్నుల డీఏపీని దిగుమతి చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తంలో 48.70 లక్షల టన్నుల డీఏపీ దిగుమతి అయినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని