
Realme: నెం.2 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా రియల్మీ
అక్టోబర్ విక్రయాల్లో శాంసంగన్ను వెనక్కి నెట్టిన రియల్మీ
దిల్లీ: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్‌ను వెనక్కి నెట్టి రియల్మీ రెండో స్థానానికి చేరుకుంది. అక్టోబరులో శాంసంగ్ మార్కెట్ వాటా 16 శాతంగా ఉండగా.. రియల్మీ వాటా 18 శాతానికి చేరుకుందని కౌంటర్‌పాయింట్ రీసెర్చి నివేదిక వెల్లడించింది. ఇక ఈ జాబితాలో 20 శాతం వాటాతో షావోమీ(పోకో బ్రాండ్‌తో కలిపి) తొలి స్థానంలో ఉంది.
2022 నాటికి 40 మిలియన్ల స్మార్ట్ఫోన్ల విక్రయాలతో తొలిస్థానానికి చేరాలని రియల్మీ లక్ష్యంగా పెట్టుకుంది. మరో రెండేళ్లలో టీవీలు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్, ట్యాబ్స్ వంటి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ టాప్ 5 జాబితాలోకి చేరతామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏడాది వ్యవధిలో రియల్మీ మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకున్నట్లు అక్టోబర్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రత్యర్థి కంపెనీల మార్కెట్ వాటాను ఆకర్షించడంలో విజయవంతమైంది. క్రితం ఏడాది మూడో త్రైమాసికంలో షావోమీ 23 శాతం, శాంసంగ్ 17 శాతం, వివో 15 శాతం, రియల్మీ 15 శాతం వాటా కలిగి ఉన్నాయి.
ఆన్లైన్ విక్రయాల్లో దూసుకెళ్లడం వల్లే రియల్మీ వృద్ధి భారీగా పెరిగింది. పండగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడైన మొబైల్ ఫోన్ల జాబితాలో రియల్‌మీదే తొలి స్థానం. ఆన్లైన్ వేదికగా అమ్ముడైన మొత్తం స్మార్ట్ఫోన్లలో రెండో స్థానం ఈ కంపెనీదే. ఈ ఏడాది పూర్తయ్యే నాటికి 23-24 మిలియన్ల ఫోన్లను విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. 2020లో ఈ సంస్థ అమ్మకాలు 18 మిలియన్లుగా నమోదయ్యాయి.
► Read latest Business News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
-
India News
IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
-
India News
Constitution: ‘దోపిడికి ఉపయోగపడేలా ఉంది’.. రాజ్యాంగంపై కేరళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
-
India News
Prisoners Release: ఖైదీలకు ‘ప్రత్యేక విముక్తి’.. కేంద్ర ప్రభుత్వం కసరత్తు
-
Crime News
Raghurama: కానిస్టేబుల్‌పై దాడి... ఎంపీ రఘురామ భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
-
Movies News
Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!