Jio: జియో యూజర్లకు మరో సదుపాయం..!

మీరు జియో యూజర్లయితే.. ఇకపై రీచార్జి తేదీని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన కస్టమర్ల కోసం రియలన్స్‌ జియో మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది......

Published : 07 Jan 2022 12:07 IST

ఇకపై రీచార్జి తేదీని గుర్తుపెట్టుకోనక్కర్లేదు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు జియో యూజర్లయితే.. ఇకపై రీచార్జి తేదీని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన కస్టమర్ల కోసం రియలన్స్‌ జియో మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. జియో కస్టమర్లు ఇకపై యూపీఐ ద్వారా తమ టారిఫ్‌ ప్లాన్‌ రీచార్జ్‌ కోసం స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌తో ఆటో డెబిట్‌ ఫీచర్‌ను సెట్‌ చేసుకోవచ్చు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)తో కలిసి కంపెనీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌.. రెండు రకాల కస్టమర్లూ దీన్ని ఉపయోగించుకోవచ్చు.

టెలికాం రంగంలో యూపీఐ ఆటోపే ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తొలి కంపెనీ జియోనే. ఇకపై జియో వినియోగదారులు గడువు ముగిసిన ప్రతిసారీ ఆటోమెటిక్‌గా టారిఫ్‌ ప్లాన్‌ను రీచార్జ్‌ చేసుకునేందుకు మైజియో యాప్‌ ద్వారా స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ను సెట్‌ చేసుకుంటే సరిపోతుంది. ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. రూ.5,000 వరకు రీచార్జ్‌కు కస్టమర్లు తమ యూపీఐ పిన్‌ కూడా ఎంటర్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి..

* మైజియో యాప్‌కి లాగిన్‌ అయ్యి.. మొబైల్‌ సెక్షన్‌కి వెళ్లాలి.

* రీచార్జిలు, పేమెంట్స్‌ విభాగంలో జియో ఆటో పే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* గెట్‌ స్టార్టెడ్‌పై క్లిక్‌ చేసి కావాల్సిన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి.

* తర్వాత యూపీఐ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* అనంతరం మీ యూపీఐ ఐడీని ఎంటర్‌ చేసి వెరిఫై చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని