Stock market: 17000 దిగువకు నిఫ్టీ.. వెంటాడిన ఒమిక్రాన్‌ భయాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లను నేడు ఒమిక్రాన్‌ భయాలు వెంటాడాయి. దీంతో రోజంతా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా కదలాడిన సూచీలు మదుపర్ల ఆందోళనలతో క్రమంగా దిగజారుతూ వచ్చింది....

Updated : 06 Dec 2021 15:37 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లను సోమవారం ఒమిక్రాన్‌ భయాలు వెంటాడాయి. దీంతో రోజంతా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా కదలాడిన సూచీలు మదుపర్ల ఆందోళనలతో క్రమంగా దిగజారుతూ వచ్చాయి. దీంతో నిఫ్టీ 17000 పాయింట్ల దిగువకు చేరింది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు, బలహీన రూపాయి, విదేశీ మదుపర్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగడం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 75.42 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 57,778.01 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో 56,777.04 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 949.32 పాయింట్ల నష్టంతో 56,747.14 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 284.45 పాయింట్లు తగ్గి 16,912.25 దగ్గర స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో ఏ ఒక్కటీ లాభపడలేదు. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, మారుతీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని