Stock Market Closing Bell: ఆర్‌బీఐ అండతో బుల్‌ జోరు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంచనున్నామన్న ఆర్‌బీఐ ప్రకటనతో సూచీలకు పైకి పరుగులు తీశాయి...

Updated : 08 Dec 2021 15:45 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంచనున్నామన్న ఆర్‌బీఐ ప్రకటనతో సూచీలు పైకి పరుగులు తీశాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న సానుకూల సంకేతాలు మరింత బలాన్నిచ్చాయి. అలాగే దేశీయంగా దాదాపు అన్ని రంగాలు రాణించడం, దిగ్గజ కంపెనీ షేర్లు పరుగులు తీయడం సెంటిమెంటును పెంచింది. మరోవైపు కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రతపై ఆందోళనలు తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడంతో.. సెన్సెక్స్‌, నిఫ్టీ అదే బాటలో నడిచాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 58,158.56 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,702.65 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1,016.03 పాయింట్ల లాభంతో 58,649.68 వద్ద ముగిసింది. 17,315.25 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 17,484.60 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 291.65 పాయింట్లు లాభపడి 17,468.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.44 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ మినహా మిగిలినవన్నీ లాభపడ్డాయి. బజాజ్‌ ఫినాన్స్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు రాణించిన వాటిలో ఉన్నాయి.  

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు