Stock market: ఆరంభ లాభాలు ఆవిరి.. నష్టాల్లో ముగిసిన సూచీలు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం భారీ లాభాల్లో ట్రేడయిన సూచీలు మధ్యాహ్నానికి కిందకు దిగజారాయి. తర్వాత కోలుకున్నప్పటికీ బలమైన సంకేతాలు లేకపోవడంతో ఊగిసలాటలో పయనించాయి. చివరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో భారీ నష్టాలు తప్పలేదు. ఆసియా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు, యూఎస్‌ ఫ్యూచర్స్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో అంతర్జాతీయ సూచీలు నష్టాలు చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ సూచీలు ఆరంభ లాభాలను జారవిడిచాయి. అలాగే రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజ షేర్లకు అమ్మకాల సెగ తాకడంతో సూచీల సెంటిమెంటు దెబ్బతింది.

ఉదయం సెన్సెక్స్‌ 57,272.08 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,183.77 - 56,867.51 మధ్య కదలాడింది. చివరకు 195.71 పాయింట్ల నష్టంతో 57,064.87 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 16,956.25 వద్ద కనిష్ఠాన్ని, 17,324.65 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 70.75 పాయింట్లు నష్టపోయి 16,983.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.16 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో 16 షేర్లు నష్టపోయాయి. అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాటా స్టీల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ షేర్లు ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫినాన్స్, హెచ్‌సీఎల్‌ టెక్, టీసీఎస్, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి.

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని