Stock market: ఊగిసలాటలో మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఊగిసలాటలో పయనిస్తున్నాయి....

Updated : 29 Dec 2021 09:46 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఊగిసలాటలో పయనిస్తున్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే లాభాల్లోకి ఎగబాకి తిరిగి నష్టాల్లోకి జారకున్నాయి. ఎట్టకేలకు ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ 68 పాయింట్ల లాభంతో 57,965 వద్ద.. నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 17,254 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.74 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, రిలయన్స్‌, సన్‌ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు...

* రిలయన్స్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో నాయకత్వ మార్పు ఉంటుందని కంపెనీ ఛైర్మన్‌, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్‌ అంబానీ తొలిసారిగా పేర్కొన్నారు. తనతో పాటు సీనియర్లందరూ ఈ మార్పులో భాగస్వాములు అవుతారని స్పష్టం చేశారు. యువతరం చేతికి పగ్గాలు ఇస్తామన్నారు.

* టొరెంట్‌ ఫార్మా‌‌: కొవిడ్‌-19 మహమ్మారి బాధితులకు ‘మోల్నుపిరవిర్‌’ యాంటీ- వైరల్‌ ఔషధం మనదేశంలో అందుబాటులోకి రానుంది. ఈ ఔషధాన్ని టొరెంట్‌ సంస్థ మోల్నుటర్‌ అనే పేరిట తీసుకురానుంది.

* డాక్టర్‌ రెడ్డీస్‌: మోల్నుపిరవిర్‌ను ‘మోల్‌ఫ్లు’ అనే బ్రాండు పేరుతో ఆవిష్కరించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. కొవిడ్‌-19 కు అన్ని రకాలైన ఔషధాలు అందించాలనేది తమ ఆలోచన అని, ‘మోల్నుపిరవిర్‌’ అందులో భాగమని డాక్టర్‌ రెడ్డీస్‌ ఎండీ జీవీ ప్రసాద్‌ వివరించారు.

* హెటిరో హెల్త్‌కేర్‌: ‘మువ్‌ఫర్‌’ అనే పేరుతో మోల్నుపిరవిర్‌ 200 ఎంజీ క్యాప్సూల్స్‌ను ఆవిష్కరించింది.

* నాట్కో ఫార్మా ‘మోల్నున్యాట్‌’ బ్రాండుతో ఈ ఔషధాన్ని తీసుకువస్తోంది. మోల్నుపిరవిర్‌ 200 ఎంజీ ఔషధాన్ని తక్కువ ధరలో అందించనున్నట్లు నాట్కో ఫార్మా స్పష్టం చేసింది.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని