Stock market: స్వల్ప లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి....

Published : 24 Nov 2021 09:26 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం నాటి భారీ దిద్దుబాటు నుంచి నిన్న కోలుకున్న సూచీలు అదే పరంపరను నేడూ కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. నేడు ఆసియా మార్కెట్లు సైతం మిశ్రమంగా కదలాడుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. 

ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్‌ 59 పాయింట్ల లాభంతో 58,724 వద్ద.. నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 17,524 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.50 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్స్‌, పవర్‌గ్రిడ్‌, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని